అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుపాను ఉత్తర మహారాష్ట్ర, దక్షిణ గుజరాత్ తీరాలను జూన్ 3న తాకే అవకాశం ఉందని వెల్లడించింది.
"అల్పపీడనం మరింత బలపడి సోమవారం సాయంత్రానికి మూడు, నాలుగు దశల్లో తుపానుగా మారే అవకాశం ఉంది. జూన్ 2 నాటికి తీవ్ర తుపానుగా మారుతుంది. మంగళవారం ఉదయం ఉత్తరం వైపు ప్రయాణించి అనంతరం ఉత్తర- ఈశాన్య దిశకు మారుతుంది. బుధవారం రాత్రి ఉత్తర మహారాష్ట్ర, దక్షిణ గుజరాత్ తీరాలను తుపాను తాకుతుంది."