తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జన్ ​ధన్​ ​ఖాతాల్లో రూ.లక్ష కోట్ల డిపాజిట్లు

ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన జన్‌ ధన్‌ బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్లు లక్ష కోట్ల రూపాయలు దాటాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజా గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడించాయి.

జన్​ఖాతాల్లో రూ.లక్ష కోట్ల డిపాజిట్లు

By

Published : Jul 11, 2019, 6:26 AM IST

Updated : Jul 11, 2019, 7:31 AM IST

జన్​ ధన్ బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్లు రూ.లక్ష కోట్లు దాటాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి. జులై 3 నాటికి 36 కోట్ల 6 లక్షలకు పైగా ప్రధానమంత్రి జన ధన్ యోజన ఖాతాల్లో రూ.లక్ష 400 కోట్ల డిపాజిట్లు ఉన్నాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. జన్‌ ధన్‌ ఖాతాల్లో లబ్ధిదారుల డిపాజిట్లు క్రమంగా పెరుగుతున్నాయని పేర్కొంది. జూన్ 6 నాటికి రూ.99 వేల 600 కోట్ల డిపాజిట్లు ఉండగా....జులై 3 నాటికి లక్ష 400 కోట్ల రూపాయలకు చేరుకున్నాయని వెల్లడించింది. దేశ ప్రజలందరికీ బ్యాంకింగ్ సదుపాయాలు కల్పించాలనే లక్ష్యంతో 2014న జన్‌ధన్‌ పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించింది ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం. ఇందులో 50 శాతానికి పైగా మహిళలు ఉన్నారు.

Last Updated : Jul 11, 2019, 7:31 AM IST

ABOUT THE AUTHOR

...view details