తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'నోట్ల రద్దుతో అసంఘటిత ఆర్థిక వ్యవస్థ విచ్ఛిన్నం' - నోట్ల రద్దు

నోట్ల రద్దు నిర్ణయంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పేదలు, రైతులు, చిన్న వ్యాపారులపై జరిగిన దాడిగా అభివర్ణించారు. దేశ అసంఘటిత ఆర్థిక వ్వవస్థను ధ్వంసం చేశారని మండిపడ్డారు.

Rahul Gandhi
రాహుల్ గాంధీ

By

Published : Sep 3, 2020, 12:45 PM IST

మోదీ ప్రభుత్వంపై వరుసగా విమర్శలు చేస్తోన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. మరో వీడియో విడుదల చేశారు. నోట్ల రద్దు కారణంగా 40 ఏళ్లలో ఎన్నడూ లేనంత ఆర్థిక సంక్షోభం ఏర్పడిందని ధ్వజమెత్తారు.

"మోదీ నగదు రహిత భారతం.. 'వాస్తవానికి కార్మికుడు, రైతు, చిన్న వ్యాపారవేత్త రహిత భారత్'. 2016 నవంబర్ 8న తీసుకున్న ఈ నిర్ణయాలు 2020 ఆగస్టు 31న భయంకరమైన ఫలితాలు ఇచ్చాయి.

జీడీపీ క్షీణతతో పాటు, దేశంలోని అసంఘటిత ఆర్థిక వ్యవస్థను నోట్ల రద్దు ఎలా విచ్ఛిన్నం చేసిందో తెలుసుకోవడానికి నా వీడియో చూడండి."

- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత

రెండు ప్రశ్నలు..

'నోట్​ బందీ కీ బాత్​' పేరుతో విడుదల చేసిన వీడియోల్లో ఇది రెండోది. ఈ వీడియోలో "రూ.500, రూ.1,000 నోట్లను నిరుపయోగం చేశారు. డబ్బులు జమ చేసేందుకు దేశమంతా బ్యాంకుల ముందు నిలబడింది. కానీ, ఈ నిర్ణయం నల్లధనాన్ని రూపుమాపిందా? పేద ప్రజలకు నోట్ల రద్దుతో చేకూరిన లాభమేంటి? వీటికి సమాధానం.. లేదు" అని తీవ్ర స్థాయిలో విమర్శించారు రాహుల్.

కానీ, ప్రజల సొమ్ముతో 50 మంది పెట్టుబడిదారుల రుణాలను మాఫీ చేశారనీ, ఫలితంగా నోట్ల రద్దుతో సంపన్నులే లాభపడ్డారని ఆరోపించారు రాహుల్ గాంధీ. నోట్ల రద్దు అనేది దేశంలో పేదలు, రైతులు, కార్మికులు, చిన్న దుకాణదారులపై దాడి చేసిందని, భారత అసంఘటిత ఆర్థిక వ్యవస్థను విచ్ఛిన్నం చేసిందని మండిపడ్డారు.

ఇదీ చూడండి:నోట్లరద్దు దేశంపై జరిగిన ఉగ్రదాడి: రాహుల్​ గాంధీ

ABOUT THE AUTHOR

...view details