తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'పెద్ద నోట్ల రద్దు వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలు' - indian economy

కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసి నేటితో మూడేళ్లు అవుతున్న సందర్భంగా యువజన కాంగ్రెస్​ కార్యకర్తలు దిల్లీలోని రిజర్వ్​ బ్యాంక్​ కార్యాలయం వద్ద నిరసనలు చేపట్టారు. ప్లకార్డులు, కాంగ్రెస్​ జెండాలు పట్టుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

'పెద్ద నోట్ల రద్దు వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలు'

By

Published : Nov 8, 2019, 5:20 PM IST

Updated : Nov 8, 2019, 7:09 PM IST

మోదీ ప్రభుత్వం 500,1000 నోట్లను రద్దు చేసి సరిగ్గా నేటితో మూడు సంవత్సరాలు అవుతోంది. ఈ సందర్భంగా యూత్​ కాంగ్రెస్​ కార్యకర్తలు దిల్లీలోని రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా కార్యాలయం వద్ద నిరసనలు చేపట్టారు. ప్లకార్డులు, కాంగ్రెస్​ జెండాలను పట్టుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజలకుప్రధాని క్షమాపణలు చెప్పాలని డిమాండ్​ చేశారు.

'పెద్ద నోట్ల రద్దు వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలు'

"ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వల్ల ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. నోట్ల రద్దు చేసి మూడేళ్లు అవుతున్నా.. ఇప్పటికీ ఆర్థిక వ్యవస్థ కుదుటపడలేదు"
-బీవీ శ్రీనివాస్​, యూత్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు.

2016 నవంబర్​ 8న ప్రధాని నరేంద్ర మోదీ.. 1000, 500 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

ఇదీ చూడండి:'కాషాయం'పై క్లారిటీ ఇచ్చిన సూపర్​స్టార్​

Last Updated : Nov 8, 2019, 7:09 PM IST

ABOUT THE AUTHOR

...view details