తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బీటెక్​లో భగవద్గీత పాఠాలపై నిరసన జ్వాలలు - PROTEST

తమిళనాడు అన్నా విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్​ కోర్సులో భగవద్గీత పేపర్​ను ప్రవేశపెట్టినందుకు నిరసనలు చేపట్టింది ద్రవిడ మున్నేట్ర కళగం(డీఎంకే) విద్యార్థి విభాగం. సంస్కృతం, భగవద్గీత సబ్జెక్టులను రద్దు చేయాలని డిమాండ్​ చేసింది.

బీటెక్​లో భగవద్గీత పాఠాలపై నిరసన జ్వాలలు

By

Published : Oct 1, 2019, 4:48 PM IST

Updated : Oct 2, 2019, 6:35 PM IST

బీటెక్​లో భగవద్గీత పాఠాలపై నిరసన జ్వాలలు

తమిళనాడు అన్నా విశ్వవిద్యాలయంలో ప్రవేశపెట్టిన సంస్కృతం, భగవద్గీత అంశాలను ఇంజినీరింగ్​ విద్యావిధానంలో నుంచి తీసేయాలన్న డిమాండ్​లు ఊపందుకున్నాయి. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని.. డీఎంకే(ద్రవిడ మున్నేట్ర కళగం) విద్యార్థి విభాగం చెన్నైలో నిరసన ప్రదర్శనలు చేపట్టింది.
కేంద్ర ప్రభుత్వం సంస్కృతాన్ని తమపై బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తోందని.. సిలబస్​ నుంచి భగవద్గీతను తొలగించే వరకు తమ నిరసనలు ఆగవని హెచ్చరించారు విద్యార్థి విభాగం నేతలు. ఇంజినీరింగ్​ విద్యార్థికి ఇది అవసరం లేదన్నారు.

మాతృభాషకై గళం వినిపించాలి..

భగవద్గీత, సంస్కృత భాషలను విద్యార్థులపై బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నారని... అన్నా యూనివర్సిటీ యాజమాన్యంపై మండిపడ్డారు డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్​. కేంద్ర ప్రభుత్వం ఇలాంటి చర్యలను మానుకోవాలని హితవు పలికారు. ప్రతి రాష్ట్రం తమ మాతృభాష కోసం గళమెత్తాలని కోరారు.

ఇదీ వివాదం...

బీటెక్​ 3వ సెమిస్టర్​లో భగవద్గీతను ఓ సబ్జెక్ట్​గా చేర్చుతూ అన్నా విశ్వవిద్యాలయం ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంపై రాజకీయ దుమారం రేగింది. వెంటనే వర్సిటీ యాజమాన్యం దిద్దుబాటు చర్యలకు దిగింది. భగవద్గీత, సంస్కృతం తప్పనిసరి కాదని... ఏఐసీటీఐ నిర్దేశించిన 12 సబ్జెక్టుల్లో విద్యార్థులు తమకు నచ్చినది ఎంచుకోవచ్చని ఉపకులపతి సూరప్ప స్పష్టంచేశారు.

ఇదీ చూడండి:ఇంజినీరింగ్​ విద్యలో సంస్కృత భాష!

Last Updated : Oct 2, 2019, 6:35 PM IST

ABOUT THE AUTHOR

...view details