జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం ఉపకులపతి జగదీష్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలన్న విద్యార్థుల డిమాండ్ సరికాదని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ అన్నారు. హాస్టల్ రుసుము పెంపుపై విద్యార్థుల డిమాండ్లు నెరవేరిన నేపథ్యంలో యూనివర్సిటీలో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితి నెలకొంటోందని పీటీఐ ముఖాముఖిలో వ్యాఖ్యానించారు. అధికారులను పదవుల నుంచి తొలగించడం పరిష్కారం కాదన్నారు. విద్యా ప్రమాణాల విషయంలో అంతర్జాతీయ స్థాయికి చేరాలంటే... ఇలాంటి వివాదాల్ని విడిచిపెట్టి ముందుకు సాగాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు.
'జేఎన్‌యూ వీసీ తొలగింపు డిమాండ్ అహేతుకం' - విద్యార్థుల డిమాండ్ల్
జేఎన్‌యూ ఉపకులపతి జగదీశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలన్న విద్యార్థుల డిమాండ్‌పై స్పందించారు కేంద్రమంత్రి రమేష్ పోఖ్రియాల్. ఈ డిమాండ్ అర్ధ రహితమని అభిప్రాయపడ్డారు. హాస్టల్ విషయంలో విద్యార్థుల డిమాండ్లు నెరవేరటం వల్ల యనివర్సిటీలో సాధరణ పరిస్థితులు నెలకొంటున్నాయని అన్నారు.

'జేఎన్‌యూ ఉపకులపతిని తొలగించాలన్న డిమాండ్ సరైంది కాదు'
హాస్టల్ నిబంధనలను మార్చుతూ యాజమాన్యం తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ విద్యార్థి సంఘాలు దిల్లీ హైకోర్టును ఆశ్రయించడంపై స్పందించారు పోఖ్రియాల్. తర్వాత ఏం చేయాలన్నది వర్సిటీ యాజమాన్యం నిర్ణయిస్తుందన్నారు.
ఇదీ చదవండి: బిడ్డకు కాలు విరిగితే బొమ్మకు కట్టుకట్టించిన తల్లి!
Last Updated : Feb 17, 2020, 9:08 PM IST