తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాష్ట్ర సరిహద్దులో వలస కార్మికుల రచ్చ - migrants pelt stones news

ఆహారం, స్వస్థలాలకు వెళ్లడానికి బస్సు ఏర్పాట్లు చేయాలనే డిమాండ్​తో మధ్యప్రదేశ్-మహారాష్ట్ర సరిహద్ధులో వలస కార్మికులు ఆందోళనలు చేపట్టారు. అధికారులు పట్టించుకోవడంలేదనే ఆవేశంతో రాళ్లు రువ్వారు.

migrants pelt stones
రాష్ట్ర సరిహద్దులో వలస కార్మికుల రచ్చ

By

Published : May 14, 2020, 11:27 PM IST

పనికోసం ఇతర ప్రాంతాలకు వచ్చి కరోనా నేపథ్యంలో చిక్కుపోయిన తమను.. సొంత ఊర్లకు చేర్చేందుకు బస్సు, తినడానికి ఆహరం ఏర్పాటు చేయాలని తీవ్ర ఆందోళన చేశారు ఈశాన్య రాష్ట్రాల వలస కార్మికులు. మధ్యప్రదేశ్-మహారాష్ట్ర ​ సరిహద్దు ప్రాంతం సెంధ్వాలో రాళ్లు రువ్వారు. అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

రాష్ట్ర సరిహద్దులో వలస కార్మికుల రచ్చ

ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వేలాది మంది వలస కార్మికులు మహారాష్ట్ర నుంచి సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు మధ్యప్రదేశ్ సరిహద్ధు ప్రాంతం సెంధ్వాలో గుమిగూడారు. ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయలేదని ఆవేశంతో రాళ్లు విసిరారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు.

సరిహద్దు నుంచి 135 బస్సుల ద్వారా వలస కార్మికులను ఇతర ప్రాంతాలకు పంపినట్లు బర్వాని జిల్లా కలెక్టర్ తెలిపారు. బస్సులు ఇక రావేమో అనే ఆవేశంలోనే కార్మికులు రాళ్లు రువ్వినట్లు చెప్పారు. వాహన ఏర్పాట్లు చేస్తామని వారికి హామీ ఇచ్చి శాంతింపజేసినట్లు వెల్లడించారు.

సెంధ్వా సరిహద్దు నుంచి గత మూడు రోజుల్లో 15వేల మంది కార్మికులను ఇతర ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. వీరిలో ఉత్తర్​ప్రదేశ్, జార్ఖండ్, బిహార్​ రాష్ట్రాలకు చెందిన వలస కూలీలు ఉన్నట్లు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details