నలుగురు దోషుల ఉరి శిక్ష మీద ఉన్న స్టేపై విచారణ చేపట్టిన దిల్లీ హైకోర్టు.. తీర్పును వాయిదా వేసింది. ఇరు పక్షాల వాదనలు పూర్తిగా ముగిసిన తర్వాతే తీర్పును వెలువరించనున్నట్టు జడ్జి సురేశ్ కైత్ వెల్లడించారు.
దిల్లీ హైకోర్టులో తేలని నిర్భయ దోషుల 'ఉరి'
18:30 February 02
స్టేపై తీర్పు వాయిదా
18:26 February 02
'ఇక శిక్ష విధించండి'
కేంద్రం ఆలస్యంగా జోక్యం చేసుకుందన్న ముఖేశ్ తరఫు న్యాయవాది వాదనలను తుషార్ మెహత్ ఖండించారు. ఇన్నేళ్లు గడిచాకా.. న్యాయపరంగా ముందుకువెళ్లడానికి దోషులకు ఇక ఎలాంటి అవకాశాలు ఇవ్వకూడదని కోర్టును కోరారు.
18:12 February 02
'ఇప్పుడు మేల్కొన్నారా?'
ముగ్గురు దోషు(అక్షయ్ సింగ్, వినయ్ శర్మ, పవన్ గుప్తా)ల తరపున న్యాయవాది ఏపీ సింగ్ వాదనలు వినిపించారు. ఉరిపై విధించిన స్టేను నిలిపివేయాలని కేంద్రం చేసిన అభ్యర్థనను తిరస్కరించాలని ధర్మాసనాన్ని కోరారు.
మరో దోషి ముఖేశ్ కుమార్ తరపున వాదనలు వినిపించిన న్యాయవాది రెబెకా జాన్ కేంద్రంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంతకుముందెన్నడూ ఈ కేసు వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదని గుర్తు చేశారు. అలాంటిది రెండు రోజుల క్రితం మేల్కొని జాప్యం జరుగుతోందంటూ ఆరోపిస్తున్నారని ఎద్దేవా చేశారు.
"డెత్ వారెంట్ జారీ చేయాలని బాధితురాలి తల్లితండ్రులు కోర్టును ఆశ్రయించారు. డెత్ వారెంట్ సత్వరమే జారీ చేయాలని ఏ స్థితిలో కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోర్టును సంప్రదించలేదు."-రెబెకా జాన్, ముఖేశ్ తరపు న్యాయవాది
దోషులను విడి విడిగా ఉరితీయవచ్చా అనే దానిపై వివరణ కోరుతూ కేంద్రం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిందని, ఈ పిటిషన్ సుప్రీం కోర్టు ముందు పెండింగ్‌లో ఉందని హైకోర్టుకు తెలిపారు రెబెకా.
17:53 February 02
హైకోర్టులో వాదనలు
నిర్భయ దోషుల ఉరి స్టేపై దిల్లీ హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. ప్రభుత్వం తరఫున విచారణకు హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా... దోషుల ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయ వ్యవస్థతో ఆటలాడుకుంటున్నారని మండిపడ్డారు. ఉరి వాయిదా వేయడం కోసం చట్టాన్ని అవహేళన చేస్తున్నారని కోర్టుకు విన్నవించారు. ఉద్దేశపూర్వకంగానే పవన్ గుప్తా... క్యురేటివ్ పిటిషన్, క్షమాభిక్ష పిటిషన్ గానీ దాఖలు చేసుకోలేదని కోర్టుకు తెలిపారు.
TAGGED:
నిర్భయ దోషులు