తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పాత్రికేయుడి చేతిలో అత్యంత రహస్య పత్రాలు? - దిల్లీ పోలీసులు

ఫ్రీలాన్స్​ పాత్రికేయుడు రాజీవ్​శర్మన్​ను దిల్లీ స్పెషల్​ సెల్​ పోలీసులు అరెస్టు చేశారు. రక్షణశాఖకు సంబంధించిన అత్యంత రహస్యమైన పత్రాలు కలిగి ఉన్నాడన్న ఆరోపణలతో రాజీవ్​శర్మను అదుపులోకి తీసుకున్నారు. అధికార రహస్యాల చట్టం కింద విచారిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి మరో ఇద్దరిని కూడా అరెస్టు చేశారు పోలీసులు.

Deli police arrests free lance journalist under official secrets act
రహస్య పత్రాల ఆరోపణలపై పాత్రికేయుడి అరెస్ట్‌

By

Published : Sep 19, 2020, 6:50 AM IST

Updated : Sep 19, 2020, 1:10 PM IST

అత్యంత రహస్యమైన పత్రాలు కలిగి ఉన్నాడన్న ఆరోపణలపై ఫ్రీలాన్స్‌ పాత్రికేయుడు రాజీవ్‌శర్మను దిల్లీ స్పెషల్‌ సెల్‌ పోలీసులు అరెస్టు చేశారు. దిల్లీలోని పీతాంపురాకు చెందిన ఆయన వద్ద.. రక్షణశాఖకు సంబంధించి రహస్య సమాచారాన్ని గుర్తించామని పోలీసులు తెలిపారు. ఈ సున్నితమైన సమాచారాన్ని చైనా నిఘాకు రాజీవ్​ అందించినట్టు పేర్కొన్నారు.

అధికార రహస్యాల చట్టం కింద ఈనెల 14న ఆయన్ను అరెస్టు చేసి, మరుసటి రోజు మేజిస్ట్రేట్‌ కోర్టులో హాజరు పరిచినట్టు డీసీపీ సంజీవ్‌కుమార్‌ యాదవ్‌ వెల్లడించారు. రాజీవ్‌శర్మ ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్నాడని, అతని బెయిల్‌ పిటిషన్‌పై ఈ నెల 22న విచారణ జరగనుందని డీసీపీ తెలిపారు.
అయితే ఈ కేసుకు సంబంధించి ఓ చైనా మహిళతో పాటు మరో నేపాల్​ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వీరు ఓ షెల్​ కంపెనీ ద్వారా రాజీవ్​కు భారీ మొత్తంలో డబ్బులు చెల్లించినట్టు పోలీసులు పేర్కొన్నారు.

ఇదీ చూడండి:-షోపియాన్​ ఎన్​కౌంటర్​ కేసులో కీలక మలుపు

Last Updated : Sep 19, 2020, 1:10 PM IST

ABOUT THE AUTHOR

...view details