తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మ్యాక్సిస్​ కేసులో నేడు చిదంబరం పిటిషన్​పై విచారణ

మ్యాక్సిస్​ కేసుల్లో ముందస్తు బెయిల్​ కోరుతూ చిదంబరం దాఖలు చేసిన పిటిషన్​ను దిల్లీ ట్రయల్​ కోర్టు నేడు విచారించనుంది. ఇప్పటికే చిదంబరం వ్యాజ్యానికి వ్యతిరేకంగా వాదనలు వినిపించాయి ఈడీ, సీబీఐ.

మ్యాక్సిస్​ కేసులో నేడు చిదంబరం పిటిషన్​పై విచారణ

By

Published : Sep 5, 2019, 5:35 AM IST

Updated : Sep 29, 2019, 12:08 PM IST

ఎయిర్​సెల్​- మ్యాక్సిస్​ కుంభకోణానికి సంబంధించిన సీబీఐ, ఈడీ కేసుల్లో చిదంబరం దాఖలు చేసిన పిటిషన్​పై నేడు ట్రయల్​ కోర్టు విచారణ చేపట్టనుంది. తనకు ముందస్తు బెయిల్​ మంజూరు చేయాలని వ్యాజ్యంలో పేర్కొన్నారు కేంద్ర మాజీ మంత్రి.

బెయిల్ మంజూరు చేయొద్దని చిదంబరం వినతికి వ్యతిరేకంగా ఇప్పటికే వాదనలు వినిపించాయి సీబీఐ, ఈడీ. కేసు దర్యాప్తునకు చిదంబరం ఆటంకం కల్గిస్తారని ఆరోపించాయి.

చిదంబరం కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉండగా ఎయిర్​సెల్​, మ్యాక్సిస్ సంస్థల మధ్య రూ.3,500 కోట్లు విలువైన ఒప్పందం జరిగింది. ఇందుకు విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు అనుమతులు మంజూరు చేయడంలో భారీ అక్రమాలు జరిగాయన్నది ప్రధాన ఆరోపణ.

ఇదీ చూడండి:- కశ్మీర్​లో ఉగ్ర దుశ్చర్యలకు పాక్​ విశ్వప్రయత్నాలు

Last Updated : Sep 29, 2019, 12:08 PM IST

ABOUT THE AUTHOR

...view details