జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం చేపట్టిన సిరో ప్రివాలెన్స్ అధ్యయనం ఫలితాలు విస్తుగొలుపుతున్నాయి. పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నప్పటికీ దిల్లీ నగరంలో ఏకంగా 23 శాతం మంది కొవిడ్-19 ప్రభావానికి గురయ్యారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. దాదాపు 23.48 శాతం మందిలో యాంటీబాడీలు ఉన్నట్టు తేలింది. ఊహించిన దానికన్నా తక్కువ మందికే సోకిందని సర్వే నిర్వాహకులు భావిస్తున్నారు.
'మహమ్మారి మొదలై ఆరు నెలలు గడిచినా దిల్లీలో 23.48% మంది మాత్రమే ప్రభావానికి గురయ్యారని సిరో ప్రివాలెన్స్ ఫలితాలు తెలియజేస్తున్నాయి. కాగా రాజధాని నగరంలో జన సాంద్రత అత్యధికంగా ఉంటుంది. దీంతో ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం, కొవిడ్-19 పట్ల ప్రజలు అవగాహనతో మెలగడమే ఈ ఫలితాలకు కారణం' అని అధ్యయనం తెలిపింది.
లక్షణాలు లేనివారే అధికం!