దిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్.. కరోనా అనుమానిత లక్షణాలతో సోమవారం రాత్రి ఆసుపత్రిలో చేరారు. తీవ్ర జ్వరం, శ్వాస సంబంధిత సమస్యలతో రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు ఆయన ట్విట్టర్లో వెల్లడించారు. కరోనా లక్షణాల నేపథ్యంలో.. ఆయన నుంచి నమూనాలను సేకరించారు వైద్యులు. సాయంత్రం కల్లా ఫలితాలు వచ్చే అవకాశమున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.
ఆరోగ్యమంత్రికి కరోనా లక్షణాలు.. ఆసుపత్రిలో చేరిక - సత్యేంద్ర జైన్
దేశ రాజధానిలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ప్రజాప్రతినిధులు, మంత్రులు, వైద్యులు ఇలా వరుసగా వైరస్ బారినపడుతున్నారు. తాజాగా దిల్లీ ఆరోగ్యమంత్రి సత్యేంద్ర జైన్ జ్వరం, శ్వాస సంబంధిత సమస్యలతో ఆసుపత్రిలో చేరారు.
దిల్లీ ఆరోగ్యమంత్రికి కరోనా లక్షణాలు.. ఆసుపత్రిలో చేరిక
దేశ రాజధానిలో కొవిడ్ తీవ్రరూపం దాలుస్తోంది. ఈ క్రమంలో కొద్దిరోజులుగా తీరిక లేకుండా వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు జైన్. మరోవైపు ఆదివారం.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలకూ హాజరయ్యారు.
జైన్ చేసిన ట్వీట్‌పై స్పందించిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. 'నీ ఆరోగ్యం గురించి ఆలోచించకుండా.. 24 గంటలూ ప్రజల క్షేమం కోసం శ్రమించారు' అని కొనియాడారు సీఎం.
Last Updated : Jun 16, 2020, 11:27 AM IST