దేశ రాజధాని దిల్లీలో కరోనా కోరలు చాస్తోంది. గడిచిన 24 గంటల్లో 5,673 కొత్త కేసులు వెలుగు చూశాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3 లక్షల 74 వేలకు చేరింది. మరో నలభై మరణాలు నమోదవడం వల్ల మొత్తం మరణాల సంఖ్య 6,369కి చేరింది. ప్రస్తుతం 29,378 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఇప్పట్లో పాఠశాలలు తెరవం: సిసోడియా
తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు దిల్లీలో పాఠశాలలు మూసే ఉంటాయని బుధవారం ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా వెల్లడించారు. ఇందుకు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా అనుకూలంగా లేరన్నారు.
స్వచ్ఛంద ప్రాతిపదికన 9 నుంచి 12వ తరగతి విద్యార్థులకు సెప్టెంబర్ 21 నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభించాలని మొదట కేజ్రీ ప్రభుత్వం భావించినప్పటికీ, తరవాత ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.
ఇదీ చూడండి: కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి కరోనా పాజిటివ్