తెలంగాణ

telangana

By

Published : Apr 26, 2020, 11:55 PM IST

ETV Bharat / bharat

కరోనాపై 'ప్లాస్మా థెరపీ' హిట్​-కోలుకున్న బాధితుడు

దేశ రాజధాని దిల్లీలో ప్లాస్మా థెరపీ విధానం ద్వారా కరోనా నుంచి కోలుకున్నాడు బాధితుడు. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కరోనాకు చికిత్స తీసుకున్న వ్యక్తికి ఈ విధానంలో పూర్తిగా నయమైనట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ పద్దతిని ఉపయోగించడం ద్వారా మహమ్మారి నుంచి బయటపడిన మొదటి వ్యక్తి ఇతడేనని పేర్కొన్నాయి.

Delhi's COVID-19 patient recovers after plasma therapy
'ప్లాస్మా థెరపీ'తో కరోనా దూరం.. కోలుకున్న బాధితుడు

ప్లాస్మా థెరపీతో కరోనా నయమవుతుందా అంటే అవుననే అంటున్నాయి దిల్లీలోని ఓ ఆసుపత్రి వర్గాలు. తమవద్ద ఈ విధానంలో చికిత్స పొందిన వైరస్ బాధితుడిలో వ్యాధి లక్షణాలు పూర్తిగా నయమైనట్లు పేర్కొన్నాయి. దీంతో అతడిని డిశ్చార్జీ చేసినట్లు వెల్లడించాయి. కరోనా బారినపడి ప్లాస్మా థెరపీ విధానం ద్వారా నయమైన వ్యక్తి ఇతడేనని పేర్కొన్నాయి.

ఇదీ జరిగింది..

ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ అని నిర్ధరణ కాగా ఏప్రిల్ 4న దిల్లీ సాకేత్ ఏరియాలోని మ్యాక్‌ ఆసుపత్రిలో చేర్చారు. రోజురోజుకూ ఆరోగ్య పరిస్థితి విషమిస్తున్న నేపథ్యంలో ఏప్రిల్ 8న వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించటం ప్రారంభించారు వైద్యులు. అయితే బాధితుడి ఆరోగ్యం పరిస్థితిలో ఎటువంటి మార్పు కనిపించని కారణంగా కుటుంబ సభ్యుల అభ్యర్థనతో ఏప్రిల్‌ 14న ప్లాస్మా థెరఫీ చేశారు.

ఈ చికిత్స అనంతరం క్రమంగా అతని ఆరోగ్యం మెరుగుపడటాన్ని గమనించామని వైద్యులు వెల్లడించారు. నాలుగు రోజుల తర్వాత వెంటిలేటర్ అవసరం లేకుండా కృత్రిమ ఆక్సిజన్​ను అందించినట్లు చెప్పారు. అనంతరం అతనికి నిర్వహించిన వైద్య పరీక్షలో వైరస్‌ నెగిటివ్‌గా రావటం వల్ల డిశ్చార్జీ చేసినట్లు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details