తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశ రాజధానిలో అత్యల్ప స్థాయికి వాయు నాణ్యత - దిల్లీ వాయునాణ్యత

దిల్లీలో సోమవారం వాయు నాణ్యత అత్యల్ప స్థాయికి పడిపోయింది. రైతులు వ్యవసాయ వ్యర్థాలను కాల్చడం ఆపకపోతే పరిస్థితులు దారుణంగా ఉంటాయని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Delhi's air quality 'very poor', stubble burning contribution may increase
దేశ రాజధానిలో అత్యల్ప స్థాయికి వాయు నాణ్యత

By

Published : Oct 26, 2020, 11:34 AM IST

దేశరాజధాని దిల్లీలో వాయు నాణ్యత రోజురోజుకూ క్షీణిస్తోంది. సోమవారం ఉదయం వాయు నాణ్యత అత్యల్ప స్థాయికి పడిపోయింది. రైతులు వ్యవసాయ వ్యర్థాలను కాల్చడం వల్ల పరిస్థితులు ఇంకా దారుణంగా ఉంటాయని హెచ్చరించింది భూశాస్త్ర మంత్రిత్వశాఖకు చెందిన సఫర్​.

సోమవారం ఉదయం 10గంటలకు.. దిల్లీ ఏక్యూఐ(ఎయిర్​ క్వాలిటీ ఇండెక్స్​) 343గా నమోదైంది. ఆదివారం 24గంటల ఏక్యూఐ సగటు 349.

దేశ రాజధానిలో అత్యల్ప స్థాయికి వాయు నాణ్యత
ఐటీఓ వద్ద ఇలా

0-50 మధ్య ఏక్యూఐ ఉంటే గాలి నాణ్యత బాగానే ఉన్నట్టు.. 51-100గా ఉంటే సంతృప్తికరంగా ఉన్నట్టు అర్థం. 101-200 మధ్య ఉంటే సాధారణం.. 201-300 మధ్య తక్కువ... 301-400 మధ్య అతి తక్కువగా ఉన్నట్టు నిర్ధరిస్తారు. 401-500 మధ్య అయితే పరిస్థితులు తీవ్రంగా ఉన్నట్టు అర్థం.

అక్షరధామ్​ వద్ద పరిస్థితి
అత్యల్ప స్థాయికి వాయు నాణ్యత

ఇదీ చూడండి:-దిల్లీ వీధుల్లో గాలిని శుభ్రపరిచే 'గన్స్'​

ABOUT THE AUTHOR

...view details