తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దిల్లీలో క్షీణించిన వాయునాణ్యత - వాయు నాణ్యత

దిల్లీలో వాయు నాణ్యత ఈ సీజన్​లో తొలిసారి క్షీణించింది. మంగళవారం ఉదయం ఏక్యూఐ-304 గా నమోదైంది. పంజాబ్​, హరియాణా రాష్ట్రల్లో వ్యవసాయ వ్యర్థాలు కాల్చడం, కాలుష్య కారకాలు పెరిగిపోవడమే దీనికి కారణమని అధికారులు తెలిపారు.

Delhi's air quality hits 'very poor' level, first time this season
ఈ సీజన్​లో దిల్లీలో తొలిసారి క్షీణించిన వాయునాణ్యత

By

Published : Oct 13, 2020, 11:40 AM IST

దేశ రాజధాని దిల్లీలో వాయునాణ్యత మళ్లీ క్షీణించింది. ఫిబ్రవరి తర్వాత తొలిసారి వాయునాణ్యత సూచీ 304గా నమోదైంది. పంజాబ్​, హరియాణాతో పాటు పొరుగు దేశం పాకిస్థాన్​లోని పలు ప్రాంతాల్లోని రైతులు వ్యవసాయ వ్యర్థాలను కాల్చడమే దీనికి ప్రధాన కారణమని కేంద్ర భూ విజ్ఞాన శాఖ తెలిపింది.

గాలులు ప్రశాంతంగా వీయడం, ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడం వల్ల కాలుష్య కారకాలు పెరిగినట్లు దిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీలోని సీనియర్ శాస్త్రవేత్త తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details