తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాష్ట్రపతితో నేడు కాంగ్రెస్​ బృందం భేటీ - congress

ఈశాన్య దిల్లీ హింసాత్మక ఘటనల నేపథ్యంలో నేడు రాష్ట్రపతితో కాంగ్రెస్​ ప్రతినిధుల బృందం సమావేశం కానుంది. పార్టీ​ అధినేత్రి సోనియా గాంధీ నేతృత్వంలో రామ్​నాథ్​ కోవింద్​తో భేటీ కానున్నారు కాంగ్రెస్​ సీనియర్లు. దిల్లీ అల్లర్లపై ఆందోళన వ్యక్తం చేసిన ఇతర విపక్ష పార్టీలు కూడా.. రాష్ట్రపతిని కలిసేందుకు సమయం కోరాయి.

Delhi violence Congress delegation to meet President Kovind on Thursday
రాష్ట్రపతితో నేడు కాంగ్రెస్​ బృందం భేటీ

By

Published : Feb 27, 2020, 5:36 AM IST

Updated : Mar 2, 2020, 5:15 PM IST

రాష్ట్రపతితో నేడు కాంగ్రెస్​ బృందం భేటీ

సోనియా గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్​ ప్రతినిధుల బృందం నేడు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ను కలవనుంది. ఈశాన్య దిల్లీ అల్లర్ల నేపథ్యంలో కోవింద్​తో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ అజాద్​, ఇతర కాంగ్రెస్​ సీనియర్లు పి.చిదంబరం, అహ్మద్​ పటేల్​, కేసీ వేణుగోపాల్​, ఆనంద్​ శర్మ తదితరులు ఈ బృందంలో ఉన్నారు.

ఈ సందర్భంగా విజయ్​ చౌక్​ నుంచి రాష్ట్రపతి భవన్​​కు మార్చ్​గా వెళ్లి.. వినతి పత్రం అందచేయనున్నట్లు సమాచారం.

అంతకుముందు దిల్లీ హింసాత్మక ఘటనలను ఖండించారు సోనియా గాంధీ. అల్లర్లకు భాజపానే కారణమని.. బాధ్యత వహిస్తూ కేంద్ర హోం మంత్రి అమిత్​ షా రాజీనామా చేయాలని డిమాండ్​ చేశారు.

ఇతర పార్టీలు కూడా...

దిల్లీ పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసిన ఇతర విపక్ష పార్టీలు కూడా రాష్ట్రపతిని కలిసేందుకు సమయం కోరాయి. సమాజ్​వాదీ పార్టీ చీఫ్​ అఖిలేశ్​ యాదవ్​, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరీ, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, డీఎంకే, ఎన్​సీపీ, లోక్​తంత్రిక్​ జనతా దళ్​ తదితర పార్టీలతో కూడిన ఈ బృందం ఫిబ్రవరి 28లోగా అపాయింట్​మెంట్​ ఇవ్వాలని కోరింది.

సీఏఏ వ్యతిరేక, అనుకూల వర్గాలు ఈ నెల 23న చేపట్టిన ఆందోళనలతో ఈశాన్య దిల్లీలో ఘర్షణలు చెలరేగాయి. 3 రోజుల వ్యవధిలో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడిప్పుడే పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయి. క్రమక్రమంగా శాంతియుత వాతావరణం నెలకొంటోంది.

Last Updated : Mar 2, 2020, 5:15 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details