ఈశాన్య దిల్లీ అల్లర్ల సమయంలో తప్పిపోయిన 13 ఏళ్ల బాలిక సురక్షితంగా తల్లిదండ్రుల వద్దకు చేరుకుంది. పోలీసులు బాలిక వాగ్మూలం కోసం మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు.
దిల్లీ సోనియా విహార్‌కు చెందిన 13 ఏళ్ల బాలిక సోమవారం 8వ తరగతి పరీక్షలు రాయడం కోసం పాఠశాలకు వెళ్లింది. ఖాజురిఖాస్లో ఉన్న పాఠశాలకు ఆమె ఇంటికి మధ్య ఉన్న దూరం 4.5 కిలోమీటర్లు.
రెడీమేడ్ వస్త్రాల వ్యాపారం చేసే బాలిక తండ్రి సాయంత్రం 5.20 గంటలకు ఆమెను పాఠశాల నుంచి ఇంటికి తీసుకురావాలని అనుకున్నారు. అయితే ఈశాన్య దిల్లీలో చెలరేగిన అల్లర్లలో ఆయన చిక్కుకుపోయారు. బాలిక కూడా పాఠశాల నుంచి ఇంటికి వస్తూ దారిలో తప్పిపోయింది. చివరికి ఇవాళ బాలికను గుర్తించిన పోలీసులు ఆమెను సురక్షితంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చారు.
సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య చెలరేగిన అల్లర్లతో ఈశాన్య దిల్లీ అట్టుడికింది . ఈ హింసాత్మక ఘటనల్లో ఇప్పటి వరకు 43 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చూడండి:బటన్ నొక్కినా కరోనా వస్తుందని వాయిస్ కంట్రోల్ లిఫ్ట్