అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. భారత్ పర్యటన నేపథ్యంలో దిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలుపై మార్గదర్శకాలు జారీ చేశారు అధికారులు. పాటించాల్సిన పలు నిబంధనలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. తమ ప్రయాణాల్లో మార్పులు చేసుకోవాలని దిల్లీ ప్రజలతో సహా వీవీఐపీలకు సూచించారు.
"భద్రత కారణాల దృష్ట్యా ఈ మార్గదర్శకాలు జారీ చేస్తున్నాం. ఈ రెండు రోజులు(24,25) ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు ట్రాఫిక్‌తో రద్దీగా ఉండే దిల్లీ కంటోన్మెంట్, గుర్గావ్, ధౌలాకాన్, ఎస్పీ మార్గ్, ఆర్ఎంఎల్ మోతీబాగ్, చాణక్యపురి, ఇండియా గేట్, ఐటీఓ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. ప్రజలు సహకరించాలి. "