తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఎన్​కౌంటర్​ హర్షనీయమే.. కానీ, శాశ్వత పరిష్కారం కాదు'

దేశంలో మహిళలపై లైంగిక దాడులను నిరసిస్తూ దిల్లీలో తెలుగు మహిళలు శాంతి ర్యాలీ నిర్వహించారు. దిశ అత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌తో సత్వర న్యాయం జరిగిందన్న మహిళలు.. ఇతర ఘటనల్లోని నిందితులకు త్వరగా శిక్ష  పడేలా చూడాలని డిమాండ్‌ చేశారు.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాల అమలులో కఠినంగా వ్యవహరించాలని కోరారు.

delhi telugu woman rally for encounter in hyderabad demands strict laws for rape
'ఎన్​కౌంటర్​ హర్షనీయమే.. కానీ, శాశ్వత పరిష్కారం కాదు'

By

Published : Dec 6, 2019, 7:04 PM IST

దిశ అత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌తో.. సత్వర న్యాయం జరిగిందని దిల్లీలోని తెలుగు మహిళలు హర్షం వ్యక్తం చేశారు. దిశ ఘటన సహా దేశంలో మహిళలపై లైంగిక దాడులను నిరసిస్తూ.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ భవన్ నుంచి జంతర్‌ మంతర్ వరకు తెలుగు మహిళలు శాంతి ర్యాలీ నిర్వహించారు.

ఎన్‌కౌంటర్‌ సమస్యకు అంతిమ పరిష్కారం కాదన్న మహిళలు.. దేశంలో మహిళలపై జరిగిన దాడి ఘటనల్లో నిందితులకు శిక్షలు త్వరగా పడేలా చూడాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాల అమలులో కఠినంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:అలా ఎలా చంపేస్తారు?: దిశ ఎన్​కౌంటర్​పై మేనక

ABOUT THE AUTHOR

...view details