తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దిల్లీలో కరోనా తీవ్రం.. 6 రోజుల్లోనే 10వేల కేసులు

దేశ రాజధాని దిల్లీలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు రికార్డు స్థాయిలో పెరుగుతోంది. మొదటి 10 వేల కేసులు నమోదయ్యేందుకు 79 రోజులు పడితే... 10 వేల నుంచి 20 వేల కేసులకు చేరుకునేందుకు 13 రోజుల సమయం పట్టింది. ఇప్పుడు ఆరు రోజుల వ్యవధిలోనే 10వేల మందికిపైగా కరోనా బారినపడ్డారు. మొత్తం కేసుల సంఖ్య 40వేలు దాటింది.

Delhi sees over 10K coronavirus cases in 6 days
దిల్లీలో కరోనా విజృంభణ.. 6 రోజుల్లోనే 10వేలకుపైగా కేసులు

By

Published : Jun 15, 2020, 1:27 PM IST

దేశ రాజధాని దిల్లీలో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. గత 6 రోజుల వ్యవధిలో కరోనా వైరస్ బారిన పడిన వారిసంఖ్య 10 వేలు దాటినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మొత్తం కేసుల సంఖ్య 40 వేలు దాటగా.. గడచిన ఆరురోజుల్లో రోజుకు సగటున 16 వందలకు పైగా కేసులు వెలుగుచూశాయి.

దిల్లీలో మొదటి 10వేల కేసులు నమోదయ్యేందుకు 79 రోజులు పడితే... 10వేల నుంచి 20 వేల కేసులకు చేరుకునేందుకు 13 రోజుల సమయం పట్టింది. 20 వేల నుంచి 30 వేలకు చేరుకునేందుకు 8 రోజులు, 30 వేల నుంచి 40 వేలకు చేరుకునేందుకు 6 రోజుల సమయం పట్టినట్లు దిల్లీ ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల ప్రకారం తెలుస్తోంది. ఆదివారం ఒక్కరోజే దిల్లీలో రికార్డు స్థాయిలో 2 వేల224 కొత్త కేసులు వెలుగుచూశాయి.

ఇదీ చూడండి: ఆపరేషన్​ దిల్లీ: కరోనా కట్టడికి త్రిముఖ వ్యూహం

ABOUT THE AUTHOR

...view details