ఈశాన్య దిల్లీలో చెలరేగిన అల్లర్లపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే 18 ఎఫ్ఐర్లు నమోదు చేసి 106 మందిని అరెస్ట్ చేశారు. ఘర్షణల్లో వాట్సాప్ గ్రూప్‌లు, దిల్లీయేతరుల పాత్రపై ప్రత్యేక దృష్టిపెట్టినట్లు సమాచారం.
"సోమవారం ఉదయం ఈ హింస మొదలైంది. పక్కా ప్రణాళిక ప్రకారం అల్లర్లు చేసినట్లు సీజ్ చేసిన కొన్ని ఫోన్ల ద్వారా తెలిసింది. మౌజ్‌పుర్, బాబర్‌పుర్, ఛాంద్బాగ్, కర్దాంపుర్ ప్రాంతాలకు పెద్ద ఎత్తున రాళ్లు తీసుకురావాలని అందులో సందేశాలు ఉన్నాయి. అలానే ద్వేషపూరిత ప్రసంగాలు, వదంతుల వ్యాప్తి, దాడి ప్రణాళిక గురించి ఉన్నాయి."
- విశ్వసనీయ వర్గాల సమాచారం
స్థానికులతో పాటు ఉత్తర్‌ప్రదేశ్ నుంచి పెద్ద సంఖ్యలో వచ్చి దిల్లీలో హింసకు పాల్పడిన వ్యక్తులను పోలీసులు గుర్తించినట్లు సమాచారం. మంగళవారం సాయంత్రం రాష్ట్ర సరిహద్దులను మూసివేశారు.