తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఎండలతో రగులుతున్న దేశరాజధాని - temperature

రుతు పవనాలు ప్రవేశించి చిరుజల్లులు పడుతుండడం వల్ల దక్షిణ భారతంలో వాతావరణం చల్లబడితే.. ఉత్తరాన్ని ఎండలు ఠారెత్తిస్తున్నాయి. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయి. పగటిపూట ఎవరూ బయటకు రావద్దని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.  దేశ రాజధాని దిల్లీలో రికార్డు స్థాయిలో  48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

దేశ రాజధానిలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు

By

Published : Jun 11, 2019, 5:01 AM IST

భానుడి ప్రతాపానికి ఉత్తర భారతం ఉక్కిరిబిక్కిరవుతోంది. పగటి ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగటం వల్ల వడగాలులతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 7 గంటల నుంచే ఎండ వేడిమి తట్టుకోలేక బయటకు రావాలంటేనే జంకుతున్నారు.

దేశ రాజధానిలో సోమవారం 48 డిగ్రీల మేర గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. రానున్న రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయని వెల్లడించింది. దిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, హరియాణా, ఛండీగఢ్ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా అధికంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

దిల్లీ నగరంలో 2014 జూన్​ 9న నమోదైన 47.8 డిగ్రీల ఉష్ణోగ్రతేఇప్పటివరకు అత్యధికం. ఇప్పుడు ఆ రికార్డును తిరగరాస్తూ 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

దేశంలో ఇప్పటికే రుతుపవనాలు ప్రవేశించగా... మధ్య భారతానికి విస్తరించేందుకు మరింత సమయం పట్టే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

రానున్న నాలుగైదు రోజుల్లో దిల్లీ వాసులకు కాస్త ఉపశమనం లభించనుందని చెప్పారు. అప్పుడు తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేశారు.

ఇదీ చూడండి:కథువా కేసులో ముగ్గురికి 25 ఏళ్లు జైలుశిక్ష

ABOUT THE AUTHOR

...view details