తెలంగాణ

telangana

ETV Bharat / bharat

యూపీలో శనివారం పాఠశాలలు, కళాశాలలకు సెలవు - జామా మసీదు వద్ద ఆందోళనల పర్వం

caa
ఆందోళనలు

By

Published : Dec 20, 2019, 2:15 PM IST

Updated : Dec 20, 2019, 11:05 PM IST

22:59 December 20

యూపీలో పాఠశాలలకు సెలవు...

ఉత్తర్​ప్రదేశ్​లోని పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలకు సెలవు ప్రకటించింది  ఆ రాష్ట్ర ప్రభుత్వం. పౌరసత్వ నిరసనలు హింసాత్మకంగా మారడం వల్ల ఈ రోజు ఉత్తర్​ప్రదేశ్​లో ఆరుగురు మరణించారు.

20:23 December 20

ప్రియాంక గాంధీ నిరసన...

దిల్లీలోని ఇండియాగేట్​ వద్ద జరుగుతోన్న నిరసనలో కాంగ్రెస్​ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. పౌర చట్టం, ఎన్​ఆర్​సీ... పేదలకు వ్యతిరేకమని ఆరోపించారు. వీటి వల్ల వారే ఎక్కు వ నష్టపోతారన్నారు. అయితే నిరసనలు శాంతియుతంగా సాగాలని పిలుపునిచ్చారు.  

20:13 December 20

యూపీలో ఐదుగురు మృతి...

ఉత్తర్​ప్రదేశ్​లోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన పౌరసత్వ నిరసనలు హింసాత్మకంగా మారడం వల్ల ఐదుగురు మృతి చెందారు. మొత్తం 50 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ మేరకు యూపీ 
డీజీపీ తెలిపారు.

19:28 December 20

యూపీలో ఐదుగురు మృతి...

ఉత్తర్​ప్రదేశ్​లో పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా నేడు జరిగిన హింసాత్మక ఆందోళనల్లో ఐదుగురు మరణించినట్లు అధికారులు తెలిపారు. 

18:19 December 20

దర్యాగంజ్​లో కారుకు నిప్పు...

దిల్లీలోని దర్యాగంజ్​లో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు జలఫిరంగులను ప్రయోగించారు. ఆగ్రహించిన ఆందోళనకారులు ఒక కారుకు నిప్పు పెట్టారు.

16:46 December 20

బహ్​రాయిచ్​లో లాఠీఛార్జి...

ఉత్తర్​ప్రదేశ్​లో పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా చేస్తోన్న నిరసనలు హింసాత్మకంగా మారాయి. బహ్​రాయిచ్​ నగరంలో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జీ చేశారు. 

16:45 December 20

యూపీలో రాళ్లదాడి...

ఉత్తర్​ప్రదేశ్​ మీరట్​లో నిరసనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. 

15:44 December 20

ఉత్తర్​ప్రదేశ్​లో పోలీసులు, నిరసనకారుల మధ్య ఘర్షణ

ఉత్తర్​ప్రదేశ్​ గోరఖ్​పుర్​లో నిరసనలు ఉద్రిక్తంగా మారాయి. పోలీసులు, నిరసనకారుల మధ్య ఘర్షణ చెలరేగింది. ఇరు పక్షాలు రాళ్లు రువ్వుకున్నాయి.

14:43 December 20

మహారాష్ట్రలోనూ...

మహారాష్ట్రలోనూ పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు మిన్నంటాయి. ముంబయి హరి మసీదు ఎదుట పలువురు.. పౌరసత్వ చట్టం, ఎన్​ఆర్​సీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

14:39 December 20

ఆగని నిరసనలు..

అజాద్​ను అరెస్టు చేసినప్పటికీ.. జామా మసీదు ఎదుట ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. పలువురు పౌర చట్టానికి వ్యతిరేకంగా అర్ద నగ్నంగా నిరసనలు చేపడుతున్నారు.  

14:24 December 20

జామా మసీదు ఎదుట ఆందోళన పరిస్థితులు..

దిల్లీ జామా మసీదు ఎదుట ఆందోళనలు ఉద్రిక్తతలకు దారితీశాయి. భీం ఆర్మీ అధినేత చంద్రశేఖర్​ అజాద్​ కూడా నిరసనల్లో పాల్గొన్నారు. అంతకుముందు ఆయనకు జామా మసీదు నుంచి జంతర్​ మంతర్​ వరకు నిరసన ప్రదర్శన చేసేందుకు అధికారులు నిరాకరించారు. కొద్ది సేపటి తర్వాత అజాద్​ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

13:58 December 20

మళ్లీ చెలరేగిన 'పౌర' జ్వాల.. భీమ్​ ఆర్మీ నేతల అరెస్టు

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దిల్లీలో మళ్లీ ఆందోళనలు చెలరేగాయి. జామా మసీదు వద్ద ఉద్రిక పరిస్థితులు నెలకొన్నాయి. 

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దిల్లీలో భీమ్‌ ఆర్మీ ఆధ్వర్యంలో తలపెట్టిన ర్యాలీకి ప్రజలు భారీగా తరలివచ్చారు. జామా మసీదు నుంచి జంతర్‌ మంతర్ వరకూ ఈ నిరసన ప్రదర్శన నిర్వహించ తలపెట్టారు. జామా మసీదు వద్ద భారీగా గుమిగూడిన ప్రజలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.

భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. భీమ్‌ ఆర్మీ తలపెట్టిన ఈ ర్యాలీకి భద్రతా కారణాల రీత్యా పోలీసులు అనుమతి నిరాకరించారు. అయినా వేలాది మంది ప్రజలు జామా మసీదు వద్దకు తరలివచ్చారు.

జామా మసీదు వద్ద పరిస్థితిని పోలీసులు డ్రోన్‌ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు.

Last Updated : Dec 20, 2019, 11:05 PM IST

ABOUT THE AUTHOR

...view details