మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నివాళులర్పించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. దిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద పుష్పాంజలి ఘటించారు. నవభారత నిర్మాణానికి బాపు ఆదర్శాలు మార్గనిర్దేశకమని ట్వీట్ చేశారు.
" జయంతి రోజున ప్రియమైన బాపూజీకి నమస్కరిస్తున్నాం. ఆయన జీవితం, గొప్ప ఆలోచనల నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. భారత్‌ను సంపన్న, దయగల దేశంగా మార్చేందుకు బాపు ఆదర్శాలు మార్గనిర్దేశం చేస్తాయి."
- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.
మహాత్ముడికి నివాళులర్పిస్తున్న మోదీ
సత్యం, అహింస, ప్రేమపై బాపు సందేశాలు సమాజంలో సామరస్యాన్ని ప్రేరేపిస్తాయని అన్నారు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్. ఇంకా పలువురు కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ సీనియర్ నేతలు రాజ్‌ఘాట్‌ను సందర్శించి.. మహాత్మునికి నివాళులు అర్పించారు.
లాల్‌బహదూర్ శాస్త్రికి నివాళులు..
మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు ప్రధాని మోదీ. ఆయన నిరాడంబరతకు నిదర్శనమని, దేశ సంక్షేమం కోసమే అనుక్షణం పరితపించేవారని గుర్తు చేసుకున్నారు. భారత్ కోసం చేసిన కృషిని.. కృతజ్ఞతతో గుర్తుంచుకుంటామని తెలిపారు.
విజయ్‌ఘాట్ వద్ద ప్రముఖుల నివాళి..
లాల్‌బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా విజయ్ ఘాట్ వద్ద పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ఆయన కుమారులు సునీల్ శాస్త్రి, అనిల్ శాస్త్రి సహా కుటుంబ సభ్యులు పుష్పాంజలి ఘటించారు.
విజయ్ ఘాట్ వద్ద నివాళులర్పిస్తున్న లాల్ బహదూర్ శాస్త్రి కుటుంబ సభ్యులు
ఇదీ చూడండి: గాంధీ జయంతి: సత్యాగ్రహ నినాదం.. నిశ్శబ్ద పోరాటం