దిల్లీలో వాయునాణ్యత అంతకంతకూ క్షీణిస్తున్న తరుణంలో చర్యలకు ఉపక్రమించింది కాలుష్య నియంత్రణ మండలి. గురువారం నుంచి డీజిల్, పెట్రోల్, కిరోసిన్లతో నడిచే అన్ని రకాల జనరేటర్లపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. గ్రేెడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్(జీఆర్ఏపీ) చర్యల్లో భాగంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు దిల్లీ కాలుష్య నియంత్రణ మండలి కమిటీ(డీపీసీసీ) తెలిపింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ నిబంధన అమల్లో ఉంటుందని పేర్కొంది.
దేశరాజధానిలో జనరేటర్ల వినియోగం 'నిషేధం'
దేశరాజధానిలో వాయునాణ్యత క్షీణిస్తున్న నేపథ్యంలో దిల్లీ కాలుష్య నియంత్రణ మండలి కీలక నిర్ణయం తీసుకుంది. జనరేటర్ల వినియోగంపై గురువారం నుంచి నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. అత్యవసర, నిత్యావసర సేవల్లో మాత్రం ఉపయోగించవచ్చని పేర్కొంది.
దిల్లీలో జనరేటర్ల వినియోగంపై నిషేధం
ఆరోగ్య సేవలు, ఎలివేటర్లు, రైల్వే, మెట్రో, ఎయిర్పోర్ట్లు వంటి నిత్యావసర, అత్యవసర సేవల్లో.. జనరేటర్ల వినయోగం కొనసాగించవచ్చని స్పష్టం చేసింది డీపీసీసీ.
దేశరాజధానిలో వాయునాణ్యత ఆందోళకర స్థాయిలో క్షీణించినప్పుడు ఇలాంటి చర్యలు చేపడుతోంది కాలుష్య నియంత్రణ మండలి. 2017లోనూ వాయు కాలుష్యం పెరిగినప్పుడు బస్సు, మెట్రో సేవలను పెంచి వాహనాల వినయోగం తగ్గేలా చేసింది. పార్కింగ్ ఛార్జీలు పెంచి, డీజిల్ జనరేటర్ల వినియోగాన్ని నిషేధించింది.