తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దిల్లీ దంగల్​: ఆప్​లో 25%, భాజపాలో 20% మంది నేరచరితులు - దిల్లీ ఎన్నికలు తాజా వార్తలు

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆమ్​ఆద్మీకి చెందిన 25 శాతం మంది, భాజపాకు చెందిన 20 శాతం మంది తీవ్రమైన క్రిమినల్​ కేసులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని 'అసోసియేషన్​ ఫర్​ డెమొక్రటిక్ రిఫామ్స్​​ ' నివేదిక స్పష్టం చేసింది.

delhi
దిల్లీ దంగల్​: ఆప్​లో 25%, భాజపాలో 20% మంది నేరచరితులు

By

Published : Feb 2, 2020, 5:39 AM IST

Updated : Feb 28, 2020, 8:37 PM IST

దిల్లీ శాసనసభ ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యుర్థుల్లో 133 మంది (20 శాతం) నేరచరితులేనని తేలింది. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సంఖ్య 114 (17 శాతం)గా ఉంది. ఎన్నికల సంఘానికి అభ్యర్థులు సమర్పించిన ప్రమాణపత్రాల ఆధారంగా 'అసోసియేషన్​ ఫర్​ డెమొక్రటిక్​ రిఫామ్స్'​ ఈ విషయం వెల్లడించింది.

గరిష్ఠంగా ఆమ్​ఆద్మీకి చెందిన 25 శాతం మంది అభ్యర్థులపై తీవ్రమైన నేరాలు ఉన్నాయి. 20 శాతం మంది భాజపా, 15 శాతం మంది కాంగ్రెస్​ అభ్యర్థులపైనా ఇలాంటి నేరాలు ఉన్నట్లు ఏడీఆర్​ నివేదిక స్పష్టం చేసింది. అత్యంత ధనికులైన మొదటి ముగ్గురు అభ్యర్థులు ఆమ్​ఆద్మీకి చెందిన వారే కావడం గమనార్హం.

ఈ ఎన్నికల్లో మొత్తం 672 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇందులో 32 మంది.. మహిళలపై నేరాలు చేసిన కేసుల్లో నిందితులుగా ఉన్నారు. ఒకరిపై అత్యాచార కేసు ఉంది. నలుగురిపై హత్యాయత్నం కేసులు ఉన్నాయి. 8 మంది విద్వేషపూరిత ప్రసంగాలు చేసిన కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్నారు.

Last Updated : Feb 28, 2020, 8:37 PM IST

ABOUT THE AUTHOR

...view details