కరోనా కారణంగా దేశ రాజధాని దిల్లీలో 53 ఏళ్ల అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్(ఏఎస్ఐ) ఒకరు మరణించారు. వైరస్‌తో పోలీసు సిబ్బందిలో ఇప్పటివరకు ఇద్దరు చనిపోయినట్లు అధికారులు తెలిపారు.
దిల్లీలోని కమలా మార్కెట్ ప్రాంతంలో నేర విభాగానికి చెందిన ఫింగర్ ప్రింట్ బ్యూరో(ఎప్పీబీ)తో కలిసి ఏఎస్ఐ విధులు నిర్వహించినట్లు వెల్లడించారు. మధ్యప్రదేశ్ రేవా జిల్లాకు చెందిన ఆయన.. 2014 నవంబరు 1న దిల్లీ పోలీసు విభాగంలో చేరినట్లు తెలిపారు.
చనిపోయిన ఏఎస్ఐ మే 26న జ్వరం, దగ్గు వంటి సమస్యలతో బాధపడుతుండటం వల్ల.. లేడీ హార్డింగ్ ఆసుపత్రిలో కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వివరించారు. మే 28న పాజిటివ్ నిర్ధరణ అయ్యిందన్నారు. వెంటనే దిల్లీ కాంట్‌లోని ఆర్మీ ఆసుపత్రికి తరలించగా.. శనివారం సాయమంత్రం మరణించినట్లు అధికారులు పేర్కొన్నారు.
అంతకుముందు వాయవ్య దిల్లీలోని భరత్ నగర్ పోలీస్ స్టేషన్లో 31 ఏళ్ల కానిస్టేబుల్ కరోనాకు బలయ్యారు.
ఇదీ చూడండి:కరోనా భయపెడ్తున్నా.. కలవరపడని ఖాకీలు