దిల్లీలోని బేగం పుర్ ప్రాంతంలో దిల్లీ పోలీసులు, నేరస్థులకు మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎదురుకాల్పుల్లో నలుగురు క్రిమినల్స్‌కు గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. అనంతరం వారిని అరెస్టు చేసి సమీపంలోని బాబా సాహెబ్ అంబేడ్కర్ ఆసుపత్రికి తరలించారు. నిందితుల నుంచి 6 తుపాకీలు, 3 బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, హెల్మెట్లతో పాటు పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
నేరస్థులను... లారెన్స్ బిష్ణోయ్ ముఠాకు చెందినవారిగా గుర్తించారు. ప్రత్యర్థి ముఠాపై దాడి చేసేందుకు వెళ్తున్నారన్న సమాచారం అందగా.. ఈ ఆపరేషన్ చేపట్టినట్లు వివరించారు పోలీసులు.