తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రధాని పేరుతో నకిలీ పథకం- ముగ్గురి అరెస్ట్ - దిల్లీ వార్తలు

'ప్రధానమంత్రి శిశు వికాస్ యోజన' పేరుతో నకిలీ వెబ్​సైట్​ నిర్వహిస్తోన్న ముగ్గురిని దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. పిల్లలకు బీమా, విద్యార్థులకు ఆర్థిక సహకారం అందిస్తామని ప్రజల నుంచి డబ్బులు కాజేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ వెబ్​సైట్​లో సుమారు 15 వేల మంది పేరు నమోదు చేసుకున్నట్లు తెలిపారు.

DL-FAKE-WEBSITES-ARREST
నకిలీ వెబ్​సైట్​

By

Published : Aug 19, 2020, 6:37 AM IST

కేంద్ర ప్రభుత్వ పథకం పేరుతో నకిలీ వెబ్​సైట్ నిర్వహిస్తోన్న ముఠాను దిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. పిల్లలకు బీమా అంటూ ఏకంగా ప్రధాని పేరుతో నకిలీ పథకాన్ని సృష్టించి వేల మంది నుంచి డబ్బులు కాజేశారని పోలీసులు గుర్తించారు. 'ప్రధానమంత్రి శిశు వికాస్ యోజన' అనే నకిలీ వెబ్​సైట్​ నిర్వహిస్తూ దేశవ్యాప్తంగా ప్రచారం కల్పించినట్లు తెలుస్తోంది.

15 వేల మంది..

అరెస్టయిన వారిలో బిహార్​కు చెందిన నీరజ్​ పాండే, సువేందర్ యాదవ్​, ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన ఆదర్శ్ యాదవ్​ ఉన్నట్లు తెలిపారు. వీరు నిర్వహిస్తున్న వెబ్​సైట్​లో ఇప్పటివరకు 15 వేల మంది ప్రజలు తమ పేరును నమోదు చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. పంచాయతీ స్థాయిల్లో భారీ నెట్​వర్క్​ రూపొందించి మోసానికి పాల్పడినట్లు స్పష్టం చేశారు.

జాతీయ ఆరోగ్య సంస్థ డైరెక్టర్​ ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తొలుత www.pmsvy-cloud.in వెబ్​సైట్​తో 'ప్రధానమంత్రి శిశు వికాస్ యోజన' నకిలీ పథకాన్ని నిర్వహిస్తున్న నీరజ్​, ఆదర్శ్​ను అరెస్ట్ చేశారు పోలీసులు. అనంతరం 'పీఎం శిశు వికాస్​ యోజన'ను నిర్వహిస్తున్న సువేందర్​ను అదుపులోకి తీసుకున్నారు.

దేశవ్యాప్త నెట్​వర్క్..

ఈ పథకాల ద్వారా పిల్లలకు బీమాతో పాటు విద్యార్థులకు ఆర్థిక సాయం అందిస్తామని వీటి ద్వారా ప్రచారం చేశారు నిందితులు. భారీగా విద్యార్థులు పేర్లు నమోదు చేసుకోవటంతో దేశవ్యాప్తంగా ఏజెంట్లను నియమించుకున్నారు. పంచాయతీ స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తూ స్థానిక ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేశారు.

ఈ నకిలీ వెబ్​సైట్ గురించి 'ప్రెస్​ ఇన్ఫర్మేషన్ బ్యూరో' ఇప్పటికే స్పష్టత ఇచ్చింది. ఇది నకిలీ వెబ్​సైట్​ అని, ప్రధానమంత్రి శిశు వికాస్ యోజన పేరుతో ఏ ప్రభుత్వ పథకం లేదని పేర్కొంది.

ఇదీ చూడండి:'స్వచ్ఛ సర్వేక్షణ్' అవార్డులు ప్రకటించనున్న మోదీ

ABOUT THE AUTHOR

...view details