దేశ రాజధాని నగరంలో కరోనా విజృంభణ కొనసాగుతున్న వేళ దిల్లీ పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. కొవిడ్ నిబంధనలను పాటించని వారిపై కొరడా ఝళిపిస్తూ చలాన్లు విధిస్తున్నారు. సోమవారం ఒక్కరోజే 1489 మంది ఉల్లంఘనులకు చలాన్లు విధించారు. ఈరోజు ఉదయం 4గంటల నుంచి ఇప్పటివరకు జారీచేసిన మొత్తం చలాన్లలో మాస్క్‌లేకుండా రోడ్లపై తిరిగేవారు 1460 మంది కాగా బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేసినవారు ముగ్గురు, భౌతికదూరం పాటించని వారు 21మంది ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
దిల్లీలో ఒక్క రోజే 1400 చలాన్లు జారీ - దిల్లీలో ఒక్కరోజే 1400 చలాన్లు జారీ
దేశ రాజధాని దిల్లీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. ప్రస్తుత శీతాకాలంలో కరోనా కేసులు రెట్టింపయ్యే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో కరోనా నిబంధనలను బేఖాతరు చేసే వారిపై దిల్లీ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. సోమవారం ఒక్కరోజే 1,489మందికి నిబంధనల ఉల్లంఘన కింద చలాన్లు జారీ చేశారు.
దిల్లీలో ఒక్కరోజే 1400 చలాన్లు జారీ
కరోనా వైరస్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటిదాకా మొత్తం 5,21,412 మందికి చలాన్లు జారీచేశారు. వారిలో మాస్క్‌లు ధరించనివారు 5,17,011 మంది కాగా బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేసినవారు 3,325 మంది, భౌతికదూరం పాటించని వారు 36,674 మంది ఉన్నట్టు పోలీసులు ప్రకటనలో తెలిపారు.