కరోనా ఆంక్షలను పాటించనందుకు దిల్లీలోని ఓ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్(ఏఎస్ఐ) సస్పెండ్ అయ్యారు. కార్యాలయంలో భౌతిక దూరం పాటించడం, మాస్కును ధరించడంలో నిర్లక్ష్యం వహించినందుకే ఏఎస్ఐని తాత్కాలికంగా విధుల నుంచి తొలగించినట్లు అధికారులు తెలిపారు.
మాస్కు ధరించనందుకు ఏఎస్సై సస్పెండ్! - ASI SUSPEND DUE TO VIOLATION OF CORONA RESTRICTIONS
కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న వేళ.. ఆంక్షలను పాటించడంలో నిర్లక్ష్యం వహించినందుకు దిల్లీలోని ఏఎస్ఐ ఒకరు సస్పెండ్ అయ్యారు. ఈ తరహాలో సిబ్బందిపై పోలీస్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకోవడం ఇదే తొలిసారి.
మాస్కు ధరించనందుకు పొలిస్ సస్పెండ్!
ప్రస్తుతం ఆ ఏఎస్ఐని జిల్లా ప్రధాన కార్యాలయంలో విచారిస్తున్నట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్(డీసీపీ) సత్యవీర్ కటారా వెల్లడించారు. ఈ తరహాలో సిబ్బందిపై డిపార్ట్మెంట్ చర్యలు తీసుకోవడం ఇదే తొలిసారి.
ప్రభుత్వ ఆదేశాల మేరకు కార్యాలయాలను తనిఖీ చేయగా ఏఎస్ఐ సురెందర్.. కరోనా ఆంక్షలను నిర్లక్ష్యం చేయడం గుర్తించినట్లు డీసీపీ తెలిపారు. ఎటువంటి పక్షపాతం లేకుండా వెంటనే ఆయన్ని సస్పెండ్ చేసినట్లు స్పష్టం చేశారు.
Last Updated : Jun 4, 2020, 8:06 PM IST