బడ్జెట్లో వేడివేడి రుచులు దక్కించుకోవాలంటే స్ట్రీట్ ఫుడ్‌ను మించిన దారి మరొకటి లేదు. గుర్తింపు పొందిన, నాణ్యత గల స్ట్రీట్ ఫుడ్‌కు ప్రజాదరణ అంతాఇంతా కాదు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో దొరికే ఆహార పదార్థాలకు సొంత ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. అలాంటి స్ట్రీట్ ఫుడ్‌ను ఓకే చోటకు తీసుకవస్తూ దిల్లీలో 11వ నేషనల్ స్ట్రీట్ ఫుఢ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు.
500 స్టాళ్లలో రుచికరమైన పదార్థాలు..
ఈ ఆహార పండుగలో దేశం నలుమూలల దొరికే పదార్థాలతో దిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ మైదానంలో ఫుడ్ స్టాళ్లు కొలువుదీరాయి. 26 రాష్ట్రాల నుంచి 130 మంది విక్రయదారులు పాల్గొంటున్నారు. 500 స్టాళ్లలో పలు రకాల ఆహార పదార్థాలు ఆదివారం రాత్రి వరకు అందుబాటులో ఉండనున్నాయి. కశ్మీర్లో దొరికే కీసర్ నుంచి కన్యాకుమారిలో దొరికే అరటి బజ్జీ వరకు అన్ని స్ట్రీట్ ఫుడ్స్ ఆహారప్రియులను రారమ్మని నోరురూరిస్తున్నాయి.
" ఇది మా 11వ ఫుడ్ ఫెస్టివల్. 2009లో తొలిసారి ఈ ప్రయత్నం చేశాం. స్ట్రీట్ ఫుడ్ విక్రయదారుల గుర్తింపు కోసం, వారి కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలనేది మా ప్రయత్నం. దాని కోసమే మా ఈ సంస్థ ఉంది. 2019లో దేశ రాజధానిలో ఒక గొప్ప అద్భుతమైన కార్యక్రమం ఇది. ఇక్కడికి వివిధ రాష్ట్రాల నుంచి స్ట్రీట్ వెండర్స్ వచ్చారు. కేరళ పాలక్కాడ్, కశ్మీర్‌లోని శ్రీనగర్, పాండీచెర్రి వంటి ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చారు. దిల్లీ ప్రజలు అచ్చమైన స్ట్రీడ్ ఫుడ్‌ను ఆస్వాదిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమం నిర్వహించటం పట్ల సంతోషంగా ఉంది. విక్రయదారులు కూడా చాలా సంతోషం వ్యక్తు చేస్తున్నారు."
- సంగీతా సింగ్, నేషనల్ స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ అసోషియేషన్ ప్రెసిడెంట్