తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'వైరస్‌పై పోరులో పెద్ద నగరాలే కీలకం'

కొవిడ్​పై భారత పోరాటంలో.. దేశరాజధాని దిల్లీ, ముంబయి సహా మరో ఆరు నగరాలే కీలకమని నీతి ఆయోగ్​ సీఈఓ అమితాబ్​ కాంత్​ అన్నారు. పరీక్షలు చేయడం, బాధితుల జాడ గుర్తించడం, నిఘానే అత్యంత ముఖ్యమని చెప్పారు.

Delhi, Mumbai, 6 other cities hold key to fight against COVID-19
'వైరస్‌పై పోరులో పెద్ద నగరాలే కీలకం'

By

Published : May 8, 2020, 7:29 AM IST

కరోనా వైరస్‌పై పోరులో దేశ రాజధాని దిల్లీ, వాణిజ్య రాజధాని ముంబయి, మరో ఆరు పెద్ద నగరాలే కీలకమని, దేశంలో నమోదైన కొవిడ్‌-19 కేసుల్లో ఎక్కువ భాగం ఈ నగరాల్లోనే నమోదవడం ఇందుకు కారణమని నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌ చెప్పారు.

దేశంలోని మొత్తం కేసుల్లో ముంబయిలోనే 20 శాతం, దిల్లీలో 11 శాతం ఉన్నాయని ఆయన ట్విట్టర్​లో పేర్కొన్నారు.

అమితాబ్​ కాంత్​ ట్వీట్​

''దేశంలో నమోదైన కొవిడ్‌-19 మొత్తంలో కేసుల్లో ముంబయిలో 20%, దిల్లీలో 11%, అహ్మదాబాద్‌లో సుమారు 9%, పుణెలో సుమారు 4%, చెన్నైలో 4%, ఇండోర్‌లో సుమారు 3%, ఠాణెలో 3 శాతానికి చేరువలో, జైపుర్‌లో సుమారు 2.5% నమోదయ్యాయి. అందువల్ల పోరులో ఈ నగరాలు కీలకంగా మారాయి. పరీక్షలు, కాంటాక్ట్‌ల గుర్తింపు, సమూహ నిఘా అత్యంత కీలకం.''

- అమితాబ్​ కాంత్​, నీతి ఆయోగ్​ సీఈఓ

దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 52 వేల 952 మందికి వైరస్​ సోకింది. మరో 1783 మంది ప్రాణాలు కోల్పోయారు.

ABOUT THE AUTHOR

...view details