దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన 70 మంది ఎమ్మెల్యేల్లో 50 శాతం మందికి పైగా క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నట్లు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్ (ఏడీఆర్) జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. ఏడీఆర్ నివేదిక ప్రకారం 70 మంది ఎమ్మెల్యేల్లో 43 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. వారిలో 37 మంది ఎమ్మెల్యేలపై హత్యాయత్నం, అత్యాచారం వంటి తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి.
13మందిపై అభియోగాలు..
37 మందిలో 13 మంది మహిళలపై నేరాలకు పాల్పడినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. వీరిలో ఒకరిపై అత్యాచారం కేసు కూడా నమోదైంది. గత శాసనసభలో 24 మంది ఎమ్మెల్యేలపై మాత్రమే క్రిమినల్ కేసులు ఉన్నాయి.