తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సీఏఏ నిరసనలు హింసాత్మకం- మెట్రో బంద్! - సీఏఏ వ్యతిరేక ఆందోళన హింసాత్మకం-మెట్రో మూసివేత!

దిల్లీలో సీఏఏ వ్యతిరేక ఆందోళన హింసాత్మకంగా మారింది. పౌరచట్ట అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఒక వర్గంపై మరో వర్గం వారు రాళ్లు రువ్వుకున్నారు. ముందు జాగ్రత్త చర్యగా జాఫ్రాబాద్ మెట్రో స్టేషన్​ను మూసేశారు అధికారులు.

caa
సీఏఏ వ్యతిరేక ఆందోళన హింసాత్మకం-మెట్రో మూసివేత!

By

Published : Feb 23, 2020, 5:45 PM IST

Updated : Mar 2, 2020, 7:47 AM IST

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దిల్లీలోని జాఫ్రాబాద్‌లో జరుగుతున్న నిరసన ప్రదర్శన హింసాత్మకంగా మారింది. సీఏఏ వ్యతిరేకులు, అనుకూలురు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జీ చేసి, బాష్పవాయువు ప్రయోగించారు. జాఫ్రాబాద్ మెట్రో స్టేషన్​ ప్రవేశద్వారాలను అధికారులు మూసేశారు.

జాఫ్రాబాద్‌ మెట్రో స్టేషన్‌ వద్ద 500 మంది పౌరచట్టానికి వ్యతిరేకంగా అర్ధరాత్రి నుంచి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆందోళనలకు మహిళలు ఎక్కువగా హాజరయ్యారు. సీఏఏను ఉపసంహరించే వరకు ఆ ప్రాంతాన్ని వదిలివెళ్లమని నినాదాలు చేస్తున్నారు. ఆందోళనల నేపథ్యంలో... ఆ ప్రాంతంలో భారీగా భద్రత బలగాలను మోహరించినప్పటికీ హింస చెలరేగింది. షాహీన్‌భాగ్‌ నిరసనకారులు మూసివేసిన రహదారిని తెరిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నవేళ... ఈ నిరసనలు చోటుచేసుకోవడం గమనార్హం.

హింసాత్మకంగా మారిన సీఏఏ ఆందోళనలు

ఇదీ చూడండి:నమస్తే ట్రంప్: ఆతిథ్యానికి సర్వం సిద్ధం- భద్రత కట్టుదిట్టం

Last Updated : Mar 2, 2020, 7:47 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details