తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనాపై దిల్లీ పోరు.. వేగంగా కోలుకుంటున్న బాధితులు - corona cases delhi

దేశ రాజధాని దిల్లీలో కరోనా మహమ్మారి వ్యాప్తిని క్రమక్రమంగా కట్టడి చేస్తున్నారు. కేసుల సంఖ్య ఇటీవలే లక్ష దాటింది. కోలుకుంటున్న బాధితుల సంఖ్య పెరగడం, కొత్త కేసుల సంఖ్య తగ్గుతుండటం ప్రభుత్వానికి ఊరటనిస్తోంది. అయితే దిల్లీలో కరోనాపై అసలు పోరు ఇప్పుడే ఆరంభమైందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరింత అప్రమత్తంగా వ్యవహరించకుండా నిర్లక్ష్యం వహిస్తే మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు.

Delhi manages to control COVID spike but experts cautious, say dip in cases has to be sustained
దిల్లీలో తగ్గుతున్న కరోనా కేసులు

By

Published : Jul 10, 2020, 4:05 PM IST

కరోనా ఉద్ధృతిని నిలువరించేందుకు దిల్లీ ప్రభుత్వం చేపట్టిన చర్యలు సానుకూల ఫలితాలనిస్తున్నాయి. కేసుల సంఖ్య లక్ష దాటినప్పటికీ యాక్టివ్ కేసుల సంఖ్య తక్కువగా ఉంది. రికవరీ రేటు పెరుగుతుండటం, కొత్త కేసుల సంఖ్యలో పెరుగుదల లేకపోవడం ఊరటనిస్తోంది. టెస్టుల సంఖ్యను భారీగా పెంచడం కూడా మరణాల రేటును తగ్గించింది.

అయితే దిల్లీలో కరోనాపై అసలు పోరు ఇప్పుడే ప్రారంభమైందని నిపుణులు చెబుతున్నారు. ఈ సమయంలో ఏ మాత్రం అలసత్వం వహించినా మహమ్మారి మళ్లీ విజృంభిస్తుందని హెచ్చరిస్తున్నారు.

" కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడం ఆహ్వానించదగ్గ విషయం. వచ్చే రెండు వారాల్లో గణాంకాలను పరిశీలించాకే ఓ అంచనాకు రావాలి. ప్రస్తుత పరిస్థితులు కొద్ది రోజుల పాటు స్థిరంగా కొనసాగి కొత్త కేసుల సంఖ్యలో వ్యత్యాసం రాకుండా ఉండాలి."

- డా. సమిరన్​ పాండా, ఐసీఎంఆర్​ ఎపిడెమియాలజీ ముఖ్య అధికారి.

దిల్లీలో మార్చి 1న తొలి కరోనా కేసు నమోదైంది. ప్రస్తుతం కేసుల సంఖ్య లక్షా 7వేల 51కి చేరింది. 3వేల 258మంది ప్రాణాలు కోల్పోయారు. రికార్డు స్థాయిలో 82వేల 226మంది కోలుకున్నారు. ప్రస్తుతం 21వేల 567 యాక్టివ్​ కేసులున్నాయి.

యుద్ధప్రాతిపదికన చర్యలు..

ఒకానొక దశలో దిల్లీలో ఆందోళనకర స్థాయిలో కేసుల సంఖ్య పెరిగింది. జూన్​ 23న 3వేల 947 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత కొద్ది రోజుల పాటు వరుసగా రోజుకు 3వేలకు పైగా కొత్త కేసులు వెలుగుచూశాయి. పరిస్థితి తీవ్రతను గమనించిన కేంద్రం, దిల్లీ ప్రభుత్వం సంయుక్తంగా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాయి. టెస్టుల సామర్థ్యాన్ని భారీగా పెంచాయి. కంటైన్​మెంట్​ జోన్లలో కఠిన ఆంక్షలు అమలు చేశాయి. ఆస్పత్రులలో సౌకర్యాలు మెరుగుపరిచాయి. తాత్కాలిక ఆస్పత్రులు నిర్మించి పడకల సంఖ్యను గణనీయంగా పెంచాయి.

ఫలితంగా కేసుల సంఖ్య క్రమంగా తగ్గింది. జూన్​ 27 నుంచి జులై 3 మధ్య సగటు కేసుల సంఖ్య 2,494కే పరిమితమైంది. అంతకు ముందు ఈ సంఖ్య 3,446గా ఉండేది. ఇప్పుడు కొత్త కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. పాజిటివిటీ రేటు కూడా గణనీయంగా తగ్గింది. జూన్​ 8నుంచి 14 మధ్య కాలంలో 31 శాతంగా ఉన్న పాజిటివిటీ​ శాతం, జూన్​ 29 నుంచి జులై 5 మధ్య కాలానికి 11 శాతానికే పరిమితమైంది.

5.5 లక్షల కేసులుండవ్​..

దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్​ సిసోడియా గతంలో చెప్పినట్లు జులై చివరి నాటికి కేసుల సంఖ్య 5.5 లక్షలకు చేరే అవకాశాలు లేవని ఇంద్రప్రస్థ యూనివర్సిటీ వైస్ ఛాన్స్​లర్​ డా. వర్మ చెప్పారు. వర్షాకాలంలో కేసుల సంఖ్య ఏ విధంగా ఉంటుందో గమనించాల్సి ఉందన్నారు.

ఇదీ చూడండి: ముల్లంగి ఊరగాయ.. కోడిగుడ్డు పచ్చడి!

ABOUT THE AUTHOR

...view details