రైలు సర్వీసుల నిర్వహణలో తొలిసారిగా ప్రైవేటు రంగం కాలుమోపనుంది. దిల్లీ-లఖ్‌నవూ మార్గం ఇందుకు ప్రయోగాత్మక వేదిక కానుంది. తేజస్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రైవేటు ఆపరేటర్లకు అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. టెండర్ ప్రక్రియ పూర్తయిన తర్వాత తేజస్ రైలు నిర్వహణ ప్రైవేటు ఆపరేటర్ చేతుల్లోకి వెళ్తుంది.
దిల్లీ-లఖ్‌నవూ మార్గంలో తేజస్ ఎక్స్‌ప్రెస్‌ను2016లోప్రకటించారు. రైల్వే టైం టేబుల్‌లో చోటు దక్కినా ఇంకా నిరీక్షణ స్థితిలోనే ఉంది. ప్రస్తుతం ఈ రైలును ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆనంద్‌నగర్ రైల్వే స్టేషన్‌లో పార్క్ చేసి ఉంచారు.
రెండు రైళ్లను ప్రైవేటు నిర్వాహకులకు అప్పగించాలని నిర్ణయించిందిరైల్వే శాఖ. 100 రోజుల ఎజెండాలో భాగంగా తొలుత తేజస్‌ను గుర్తించారు. రెండో రైలును త్వరలోనే వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.