తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రపంచంలోనే అతిపెద్ద కొవిడ్ ఆసుపత్రి దిల్లీలో.. - DRDO

దిల్లీలో 10 వేల పడకల సామర్థ్యంతో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద కొవిడ్ ఆసుపత్రిని లెఫ్టినెంట్ గవర్నర్​ అనిల్ బైజాల్ ప్రారంభించారు. దీనికి నోడల్ ఏజెన్సీగా ఐటీబీపీ వ్యవహరిస్తోంది.

Delhi LG inaugurates world's 'largest' COVID-19 care centre
దిల్లీలో ప్రపంచంలోనే అతిపెద్ద కొవిడ్ ఆసుపత్రి ప్రారంభం

By

Published : Jul 5, 2020, 11:33 AM IST

Updated : Jul 5, 2020, 12:34 PM IST

దిల్లీలో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద కొవిడ్‌ ఆసుపత్రిని దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్​​ ప్రారంభించారు. దిల్లీ ఛత్తర్​పుర్​ రాధా స్వామి సత్సంగ్‌ బియాస్‌ ప్రాంతంలో... పది వేల పడకల సామర్థ్యంతో ఈ ఆసుపత్రిని ఏర్పాటుచేశారు.

20 ఫుట్‌బాల్‌ మైదానాలంత విస్తీర్ణంలో 200 ఎన్‌క్లోజర్స్‌తో ఈ కొవిడ్ కేర్ ఆసుపత్రిని నిర్మించారు. ఒక్కో ఎన్‌క్లోజర్‌లో 50 పడకలను ఏర్పాటు చేశారు. వ్యాధి లక్షణాలు లేని కరోనా రోగులకు, తక్కువ తీవ్రత ఉన్న బాధితులకు ఇక్కడ చికిత్స అందిస్తారు.

సర్దార్ పటేల్ కొవిడ్ ఆసుపత్రి
దిల్లీలోని 10,000 పడకల కొవిడ్ ఆసుపత్రి
ప్రపంచంలోనే అతిపెద్ద కొవిడ్​ ఆసుపత్రికి నోడల్ ఏజెన్సీగా ఐటీబీపీ

నోడల్ ఏజెన్సీగా ఐటీబీపీ

ముఖ్యంగా ఇంటి ఐసోలేషన్ సౌకర్యంలేని కరోనా వ్యాధిగ్రస్తులకు ఈ కేంద్రం చికిత్స అందించనుంది. ఈ ఆసుపత్రికి ఇండో-టిబెటన్ బోర్డర్‌ పోలీస్‌ (ఐటీబీపీ) నోడల్‌ ఏజెన్సీగా వ్యవహరిస్తోంది.

11 రోజుల్లోనే వెయ్యి పడకల ఆసుపత్రి నిర్మాణం

దిల్లీలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో... రక్షణ పరిశోధనా అభివృద్ధి సంస్థ (డీఆర్​డీఓ) 11 రోజుల్లోనే తాత్కాలిక కొవిడ్​ ఆసుపత్రిని నిర్మించింది. దిల్లీ కంటోన్మెంట్ ప్రాంతంలో సర్దార్‌ వల్లభ్​భాయ్‌ పటేల్‌ పేరిట నిర్మించిన ఈ ఆసుపత్రిలో... 250 ఐసీయూ పడకలు సహా మొత్తం వెయ్యి పడకలు ఏర్పాటు చేశారు.

దిల్లీలోని 1000 పడకల సర్దార్ పటేల్ ఆసుపత్రి
దిల్లీలోని 1000 పడకల ఆసుపత్రి
దిల్లీలోని 1000 పడకల ఆసుపత్రిలోని వైద్య పరికరాలు

ఈ ఆసుపత్రిలోని వార్డులకు తూర్పు లద్దాఖ్ గల్వాన్​ ఘర్షణలో అమరులైన భారత జవాన్ల పేర్లు పెట్టారు. అలాగే ఓ ఐసీయూ వార్డుకు అమరవీరుడు కర్నల్ సంతోష్​బాబు పేరు పెట్టారు.

ఇదీ చూడండి:రికార్డ్: ఒక్కరోజులో 24 వేల 850 కేసులు, 613 మరణాలు

Last Updated : Jul 5, 2020, 12:34 PM IST

ABOUT THE AUTHOR

...view details