తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దిల్లీ కాలుష్యానికి, 'నిర్భయ' దోషి ఉరికి లింకేంటి? - national news in telugu

నిర్భయ కేసులో తన ఉరిశిక్షను పునఃసమీక్షించాలని నిందితుడు అక్షయ్​ కుమార్​ దాఖలు చేసిన పిటిషన్​లో పేర్కొన్న విషయాలు.. చర్చనీయాంశమయ్యాయి. దిల్లీ పూర్తిగా విషవాయువులతో నిండిపోయిందని.. ఇలాంటి పరిస్థితుల్లో తనకు మరణ శిక్ష ఎందుకని అందులో ప్రశ్నించాడు. జీవితం చిన్నగా మారిపోయిందని.. తనకు బతికే అవకాశం ఇవ్వాలని ప్రాధేయపడ్డాడు.

delhi-is-gas-chamber-then-why-death-penalty-asks-nirbhaya-gang-rape-accused
దిల్లీ కాలుష్యానికి, 'నిర్భయ' దోషి ఉరికి లింకేంటి?

By

Published : Dec 11, 2019, 10:50 AM IST

2012లో సంచలనం రేపిన నిర్భయ కేసులో నిందితుడిగా ఉన్న అక్షయ్​ కుమార్​ సింగ్..​ తనకు విధించిన ఉరిశిక్షను పునఃసమీక్షించాలని సుప్రీంకోర్టును కోరాడు. ఇందుకోసం అక్షయ్​ దాఖలు చేసిన వ్యాజ్యంలో పేర్కొన్న విషయాలు చర్చనీయాంశమయ్యాయి. దిల్లీ ఓ గ్యాస్​ ఛాంబర్​(విషపూరితం) అని.. అలాంటప్పుడు తనకు మరణ శిక్ష ఎందుకని పిటిషన్​లో పేర్కొన్నాడు అక్షయ్.

''కలుషిత నీరు, గాలితో దిల్లీ-ఎస్​సీఆర్​ ప్రాంతంలో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలిసిందే. జీవితకాలం తగ్గిపోతోంది. అలాంటప్పుడు.. మరణ శిక్ష విధించడం ఎందుకు?''

- పునఃసమీక్ష పిటిషన్​లో అక్షయ్​

2012లో ఘటన..

దేశ రాజధాని నడిబొడ్డున ఏడేళ్ల క్రితం 2012 డిసెంబరు 16వ తేదీ రాత్రి 23 ఏళ్ల పారామెడికల్‌ విద్యార్థినిపై దిల్లీలో ఆరుగురు సామూహిక అత్యాచారానికి, అత్యంత హేయమైన చర్యలకు పాల్పడ్డారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స నిమిత్తం ఆమెను సింగపూర్‌కు తరలించగా అక్కడ కన్నుమూసింది.

నిర్భయపై అత్యాచారం, హత్య కేసు దోషుల్లో ఒకడు మైనర్. మరొక దోషి రామ్​సింగ్​ 2013లో తిహార్​ కారాగారంలో ఆత్మహత్య చేసుకున్నాడు. మిగిలిన నలుగురికి దిల్లీ ట్రయల్​ కోర్టు విధించిన మరణశిక్షను 2017లో సుప్రీం కోర్టు సమర్థించింది. ఈ కేసులోని ముగ్గురు దోషులు గతంలో దాఖలు చేసిన సమీక్ష పిటిషన్లను.. న్యాయస్థానం 2018 జులై 9న కొట్టివేసింది. మంగళవారం నాలుగో దోషి సమీక్ష వ్యాజ్యం వేశాడు.

ఇవీ చూడండి:

దిల్లీలో అత్యంత ప్రమాదకర స్థాయికి వాయుకాలుష్యం

'నిర్భయ' దోషుల కోసం ఆ​ జైలులో ఉరి తాళ్ల తయారీ?

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details