తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నిర్భయ కేసు: కేంద్రం పిటిషన్​పై రేపు తీర్పు - centre plea

నిర్భయ హత్యాచారం కేసులో కేంద్రం దాఖలు చేసిన పిటిషన్‌పై రేపు దిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించనుంది. దోషుల ఉరిశిక్షపై స్టే విధిస్తూ పటియాలా కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ కేంద్రం పిటిషన్​ దాఖలు చేసింది.

Delhi HC to pronounce on Wednesday order on Centre's plea challenging stay on execution of four convicts
నిర్భయ కేసు: కేంద్రం పిటిషన్​పై రేపు తీర్పు

By

Published : Feb 4, 2020, 8:11 PM IST

Updated : Feb 29, 2020, 4:40 AM IST

నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషులకు ఉరిశిక్ష అమలు చేయకుండా దిల్లీ పటియాలా హౌస్‌ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్‌పై దిల్లీ హైకోర్టు రేపు తీర్పు వెలువరించనుంది. కేంద్రం పిటిషన్‌పై శనివారం, ఆదివారం ప్రత్యేకంగా విచారణ జరిపిన దిల్లీ హైకోర్టు ఈనెల2న తీర్పును రిజర్వ్‌ చేసింది.

దోషుల క్షమాభిక్ష, క్యూరేటివ్‌ పిటిషన్లు వివిధ దశల్లో పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో ఉరిశిక్ష అమలుపై పటియాలా హౌస్‌ కోర్టు జనవరి 31న స్టే విధించింది. ఈ స్టేను సవాల్‌ చేస్తూ కేంద్రం, దిల్లీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించాయి.

Last Updated : Feb 29, 2020, 4:40 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details