తెలంగాణ

telangana

By

Published : Feb 1, 2020, 8:05 PM IST

Updated : Feb 28, 2020, 7:48 PM IST

ETV Bharat / bharat

నిర్భయ దోషుల ఉరిపై రేపు దిల్లీ హైకోర్టు నిర్ణయం!

దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన నిర్భయ దోషుల ఉరిపై దిల్లీ హైకోర్టు రేపు కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. నలుగురు దోషుల ఉరిపై దిల్లీకోర్టు ఇచ్చిన స్టేను సవాలు చేస్తూ కేంద్రం దాఖలు చేసిన వ్యాజ్యాన్ని విచారించిన న్యాయస్థానం.. నిర్భయ దోషులతో పాటు తిహార్​ జైలు అధికారులకు నోటీసులు జారీ చేసింది. రేపు ఆదివారం అయినప్పటికీ.. కేసును విచారించనుంది.

Delhi HC to hear Centre's plea challenging stay on execution of Nirbhaya case convicts on Sunday
నిర్భయ దోషుల ఉరిపై రేపు దిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం!

నిర్భయ దోషుల ఉరిపై రేపు దిల్లీ హైకోర్టు నిర్ణయం!

నిర్భయ దోషుల ఉరిపై దిల్లీ కోర్టు విధించిన స్టేను కేంద్రం సవాలు చేసింది. ఈ మేరకు దిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. కేంద్రం పిటిషన్​పై విచారణ జరిపిన న్యాయస్థానం.. ఇదే అంశంపై నలుగురు దోషుల అభిప్రాయం కోరింది. ఈ పిటిషన్​పై రేపు మరోమారు వాదనలు విననుంది. ఈ మేరకు అధికారులతో పాటు దోషులకూ నోటీసులు జారీ చేసింది.

వ్యాజ్యంలో...

నలుగురు నిర్భయ దోషుల ఉరిపై దిల్లీ కోర్టు స్టే విధించడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది కేంద్రం. న్యాయపరమైన అవకాశాలను ఉపయోగించుకోవడానికి దోషులకు ఇదివరకే తగిన సమయం ఇచ్చినట్టు పిటిషన్​లో పేర్కొంది. ఉరి నుంచి తప్పించుకోవడానికే దోషులు చట్టాన్ని దుర్వినియోగిస్తున్నారని, కోర్టులు, న్యాయవ్యవస్థనే అవహేళన చేస్తున్నారని సొలిసిటర్​ జనరల్​ తుషార్​ మెహతా విన్నవించారు.

ఇదీ చూడండి:- నిర్భయ: క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేసిన మరో దోషి

విచారణ సందర్భంగా... న్యాయ ప్రక్రియను దోషులు ఓ 'వినోదాత్మక ప్రయాణం'గా పరిగణిస్తున్నారని మండిపడ్డారు మెహతా. ఉరిని ఆలస్యం చేయడానికి ఒకదాని వెనుక మరొక అస్త్రాన్ని సిద్ధం చేసుకుంటున్నారని తెలిపారు.

నేడు 'ఉరి' తీయాల్సింది

ఈ రోజు ఉదయం 6 గంటలకు నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు కావాల్సి ఉంది. కానీ దోషులకు న్యాయపరమైన అవకాశాలు ఇంకా ఉన్నాయని... శుక్రవారం సాయంత్రం ఉరిపై స్టే విధించింది దిల్లీ కోర్టు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తాజాగా దిల్లీ హైకోర్టును ఆశ్రయించింది కేంద్రం.

Last Updated : Feb 28, 2020, 7:48 PM IST

ABOUT THE AUTHOR

...view details