తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జెట్​ ఎయిర్​వేస్​కు దిల్లీ హైకోర్టు నోటీసులు - Refund

రద్దుతో టికెట్​ బుక్​ చేసుకున్న ప్రయాణికులకు రిఫండ్​, ప్రత్యామ్నాయ విమానాల సదుపాయం కల్పించాలన్న పిటిషన్​పై జెట్​ ఎయిర్​వేస్​కు దిల్లీ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. డీజీసీఏ, పౌర విమానాయాన మంత్రిత్వ శాఖలూ స్పందించాలని ఆదేశించింది.

జెట్​ ఎయిర్​వేస్​కు దిల్లీ హైకోర్టు నోటీసులు

By

Published : May 1, 2019, 4:48 PM IST

ఆర్థిక సంక్షోభంతో తాత్కాలికంగా మూతపడ్డ జెట్​ ఎయిర్​వేస్​కు దిల్లీ హైకోర్టు నోటీసులు పంపించింది. రద్దు చేసిన విమానాల్లో టికెట్​ బుక్​ చేసుకున్న ప్రయాణికులకు డబ్బులు తిరిగి చెల్లించటం, ప్రత్యామ్నాయ విమానాల సదుపాయం అందే విధంగా చూడాలన్న పిటిషన్​పై తాఖీదులు జారీచేసింది.

జెట్​ ఎయిర్​వేస్​ వ్యవహారంపై ప్రమాణపత్రం దాఖలు చేయాలని డీజీసీఏతో పాటు విమానయాన శాఖను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రాజేంద్ర మీనన్​ నేతృత్వంలో ధర్మాసనం ఆదేశించింది. ఈ పిటిషన్​పై తదుపరి వాదనలు జులై 16న జరగనున్నాయి.

పిటిషనర్​ లేవనెత్తిన అంశాలు...

బెజన్​ కుమార్​ మిశ్రా అనే సామాజిక కార్యకర్త దాఖలు చేసిన ఈ పిటిషన్​లో... మిగతా విమానయాన సంస్థలు టికెట్​ ధరలను పెంచటం వల్ల టికెట్​ బుక్​ చేసుకున్న వారు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు.

ప్రయాణికులు టికెట్ల కోసం చెల్లించిన రూ.360 కోట్లు నష్టపోవాల్సి ఉంటుందన్న మీడియా నివేదికను ఉటంకించారు పిటిషనర్. రెండున్నర సంవత్సరాల నుంచి పరిస్థితి బాగోలేనప్పటికీ అధికారులు టికెట్​ అమ్మకాలకు అనుమతించారని తెలిపారు.

ఇదీ చూడండి : అసాంజే సమాధానం చెప్పాల్సిందే: హిల్లరీ

ABOUT THE AUTHOR

...view details