తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చిదంబరానికి నిరాశ- ఐఎన్​ఎక్స్​ కేసులో బెయిల్​ నిరాకరణ

కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి దిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. ఐఎన్​ఎక్స్​ మనీలాండరింగ్ కేసులో బెయిల్​ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది.

చిదంబరానికి నిరాశ- ఐఎన్​ఎక్స్​ కేసులో బెయిల్​ నిరాకరణ

By

Published : Nov 15, 2019, 3:09 PM IST

ఐఎన్​ఎక్స్​ మనీలాండరింగ్ కేసులో బెయిల్​ మంజూరు చేయాలన్న కేంద్ర మాజీ మంత్రి చిదంబరం అభ్యర్థనను దిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. చిదంబరంపై ఉన్న ఆరోపణలు తీవ్రమైనవని, నేరంలో ఆయన కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఇలాంటి సమయంలో బెయిల్​ ఇస్తే సమాజానికి తప్పుడు సంకేతం వెళ్తుందని అభిప్రాయపడింది.

ఆగస్టు 21న అరెస్టయిన చిదంబరం... ప్రస్తుతం తిహార్ జైలులో ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details