దేశ రాజధాని దిల్లీలో మద్యం కొనుగోలు కోసం సుమారు 4.75 లక్షలకుపైగా ఈ-టోకెన్లు జారీ చేసింది కేజ్రీవాల్ ప్రభుత్వం. వినియోగదారులకు అందించే టోకెన్లపై నిర్ణీత సమయం ఉండటం వల్ల లిక్కర్ దుకాణాల ముందు భౌతిక దూరం నియమాల ఉల్లంఘన జరగదని తెలిపింది.
కొద్ది రోజుల క్రితం లాక్డౌన్ ఆంక్షలు సడలిస్తూ సుమారు 200 మద్యం దుకాణాలకు అనుమతించింది దిల్లీ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో లిక్కర్ షాపుల ముందు పెద్ద సంఖ్యలో ప్రజలు బారులుతీరారు. భౌతిక దూరం నియమాలను పాటించకపోవటాన్ని గుర్తించి గత గురువారం(మే 7న) ఈ-టోకెన్ వ్యవస్థను అమలులోకి తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు.