తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కన్నయ్య' దేశద్రోహం కేసు విచారణకు దిల్లీ సర్కార్​ ఓకే..!

జవహర్​లాల్​ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి సంఘం మాజీ నాయకుడు, వామపక్ష నేత కన్నయ్య కుమార్​పై దిల్లీ ప్రభుత్వం షాకిచ్చింది. అతనిపై పెండింగ్​లో ఉన్న నాలుగేళ్ల కిందటి దేశద్రోహం కేసు విచారణకు అనుమతిచ్చింది. జేఎన్​యూ మాజీ విద్యార్థి అయిన కన్నయ్య.. 2016లో క్యాంపస్​లో దేశ వ్యతిరేక నినాదాలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

Delhi govt gives nod to prosecute Kanhaiya in sedition case
'కన్నయ్య' దేశద్రోహం కేసు విచారణకు దిల్లీ సర్కార్​ ఓకే..!

By

Published : Feb 29, 2020, 7:15 AM IST

Updated : Mar 2, 2020, 10:28 PM IST

'కన్నయ్య' దేశద్రోహం కేసు విచారణకు దిల్లీ సర్కార్​ ఓకే..!

నాలుగు సంవత్సరాల క్రితం నాటి కన్నయ్య కుమార్​ దేశద్రోహం కేసు విచారణ కొనసాగింపునకు దిల్లీ సర్కారు అనుమతినిచ్చింది. జవహర్​లాల్​ నెహ్రూ యూనివర్సిటీ మాజీ విద్యార్థి అయిన కన్నయ్య కుమార్..​2016 ఫిబ్రవరి 9న నిర్వహించిన ఓ కార్యక్రమంలో దేశ వ్యతిరేక నినాదాలు చేసినట్లు ఆరోపణలున్నాయి.

ఈ కేసు విచారణ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ గతవారం కేజ్రీవాల్​కు లేఖ రాశారు దిల్లీ పోలీసులు. కన్నయ్య కుమార్ విచారణకు సంబంధించిన దరఖాస్తు 2019 జనవరి 14 నుంచి పెండింగులో ఉంది. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు లేఖ రాయగా.. తాజాగా ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది.

దిల్లీ ప్రభుత్వ నిర్ణయాన్ని.. అక్కడి భాజపా చీఫ్​ మనోజ్​ తివారీ స్వాగతించారు. రాజధానిలో ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొనే ఇలా చేశారేమో అని వ్యాఖ్యానించారు.

వారి ప్రయోజనాల కోసమే..!

ఈ అంశంపై స్పందించిన కన్నయ్య కుమార్​.. దిల్లీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. రాజకీయ ప్రయోజనాల కోసమే ఇంతకాలం కేసును తిరగతోడలేదని ఆరోపించారు. విచారణ వేగంగా పూర్తి చేసేందుకు ఫాస్ట్​ ట్రాక్​ కోర్టు ఏర్పాటు చేయాలని కోరారు కన్నయ్య. దేశద్రోహం కేసులు ఎలా దుర్వినియోగం అవుతున్నాయో దేశానికి తెలపాలనుకుంటున్నట్లు ట్వీట్​ చేశారు.

'కన్నయ్య' దేశద్రోహం కేసు విచారణకు దిల్లీ సర్కార్​ ఓకే..!
Last Updated : Mar 2, 2020, 10:28 PM IST

ABOUT THE AUTHOR

...view details