కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో దిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దిల్లీలోని విశ్వవిద్యాలయాల్లో రానున్న అన్ని సెమిస్టర్, ఫైనల్ పరీక్షలను రద్దు చేస్తున్నట్టు ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా శనివారం ప్రకటించారు.
'రాష్ట్రంలో సెమిస్టర్, ఫైనల్ పరీక్షలు రద్దు' - కరోనా వైరస్ దిల్లీ
విశ్వవిద్యాలయాల్లో రానున్న సెమిస్టర్, ఫైనల్ పరీక్షలు రద్దు చేయనున్నట్లు దిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. కరోనా సంక్షోభం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
'రాష్ట్రంలో సెమిస్టర్, ఫైనల్ పరీక్షలు రద్దు'
తగిన విధానాలను ఎంపిక చేసి.. విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేయమని.. ఫైనల్ ఇయర్ విద్యార్థులకు డిగ్రీ పట్టా అందజేయాలని విశ్వవిద్యాలయాలకు సూచించినట్టు పేర్కొన్నారు సిసోడియా.
కరోనా సంక్షోభంలో పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాని విషయమని.. అసాధారణ సమయాల్లో అసాధారణ నిర్ణయాలు తీసుకువాలని వెల్లడించారు.