దిల్లీ హింసాత్మక ఘటనలను కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఖండించారు. నిరసనల్లో 20 మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. అల్లర్లకు కారణం భాజపానే అని ఆరోపించారు. ఈ ఘటకు కేంద్ర ప్రభుత్వం, హోంమంత్రి అమిత్ షా బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఇంత జరుగుతున్నా పోలీసులు బలగాలను మోహరించడంలో ఎందుకు అలసత్వం వహించారని కేంద్రాన్ని ప్రశ్నించారు సోనియా. పలువురు భాజపా నేతల ద్వేషపూరిత ప్రసంగాలు దిల్లీలో భయాందోళనలు రేకెత్తించాయని అన్నారు.
"హింస వెనుక కుట్ర దాగి ఉంది. ఆ విషయం దిల్లీ ఎన్నికల్లో కూడా చూశాం. కొందరు భాజపా నేతలు చేసిన వ్యాఖ్యలు దిల్లీలో భయాందోళనలు రేకెత్తించాయి. దిల్లీలో ప్రస్తుత పరిస్థితులకు కేంద్రం ప్రభుత్వం, కేంద్ర హోంమంత్రిదే బాధ్యత. హోంమంత్రి తప్పక రాజీనామా చేయాలి."-సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు.