దిల్లీలో వరుస అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. ఇవాళ ఉదయం.. రాజధానిలోని పట్పర్గంజ్ పారిశ్రామిక ప్రాంతంలోని పేపర్ ప్రింటింగ్ ప్రెస్లో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు.
దిల్లీలో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి - One person died in the fire which has broken out in Patparganj Industrial Area.
దేశ రాజధాని దిల్లీలో మరో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పట్పర్గంజ్ పారిశ్రామిక ప్రాంతంలోని ఓ పేపర్ ప్రింటింగ్ ప్రెస్లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. అగ్నిమాపక సిబ్బంది శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
దిల్లీలో అగ్నిప్రమాదం.. మంటలార్పుతున్న సిబ్బంది
ఉదయం 2.38 గంటలకు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించారు. 8 గంటల సమయానికి మంటలను అదుపులోకి తెచ్చారు. ఘటనా సమయంలో.. మొత్తం 35 అగ్నిమాపక యంత్రాలతో సహాయక చర్యలు చేపట్టారు. అగ్నిప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది.
Last Updated : Jan 9, 2020, 9:19 AM IST