"నా చుట్టూ మంటలు అలముకున్నాయి. మహా అయితే రెండు మూడు నిమిషాలు బతుకుతా. నేను చెప్పదలచుకున్నది ఒకటే.. నా కుటుంబాన్ని చక్కగా చూసుకో" అంటూ దిల్లీ అగ్నిప్రమాద మృతుడి చివరి ఫోన్ కాల్ ఇప్పుడు అందరినీ కంటతడి పెట్టిస్తోంది. అతడి సంభాషణ రికార్డింగ్ బట్టి ప్రమాద సమయంలో మృతి చెందిన కార్మికులు చివరి నిమిషంలో పడిన వేదన అర్థమవుతోంది. ఓ వైపు అగ్నికీలలు ఎగసిపడుతున్నా... తప్పించుకునే పరిస్థితి లేక మంటలకు ఆహుతైనట్లు తెలుస్తోంది.
యూపీకి చెందిన ముషారఫ్ అలీ
దిల్లీలోని ఆదివారం ఉదయం ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకున్న ఘటనలో ఆ భవనంలో పనిచేస్తున్న సుమారు 43 మంది కార్మికులు మృతిచెందిన సంగతి తెలిసిందే. మృతుల్లో ఒకరైన ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ కార్మికుడు.. చనిపోయే ముందు తన సోదరుడికి ఫోన్‌చేసి మాట్లాడిన ఆడియో బయటపడింది. ఫోన్ సంభాషణ బట్టి బాధితుడిని యూపీలోని బిజ్‌నోర్‌కు చెందిన ముషారఫ్ అలీ (30)గా గుర్తించారు.